జోరు త‌గ్గించ‌ని అన‌సూయ‌.. ఐటెం సాంగ్‌తో మ‌రోసారి ర‌చ్చ చేసేందుకు రెడీ

బుల్లితెరపై అల్టిమేట్ టాలెంట్ తో.. అద్దిరిపోయే ఎనర్జీతో అలరిస్తుంటుంది అనసూయ భరద్వాజ్. అలాగే వెండితెరపై కూడా తన సత్తా చాటుకుంటుంది. కథలో మలుపు తిప్పే పాత్రలతో పాటు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే స్పెషల్ సాంగ్ ల వరకు తన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటుంది ఈ హాట్ యాంకర్. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతున్న ఈ నటి స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిపిస్తుంది. లేటెస్ట్ గా చావు కబురు చల్లగా అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో తన టాలెంట్ ని చూపించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. కార్తీకేయ, లావణ్య త్రిపాఠా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ డైరెక్షన్ వహిస్తున్నారు.

యాంకర్ అనసూయ గతంలో సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే ఎఫ్ 2 సినిమాలో కూడా డింగ్ డాంగ్ అనే సాంగ్ కు మాస్ పర్ఫార్మెన్స్ అందించి కుర్రకారుని ఎంటర్ టైన్ చేసింది. ఇప్పడు చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ తో మరోసారి ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించడానికి సిద్దమయ్యింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అందిస్తున్నారు. అయితే అనసూయ ఈ స్పెషల్ సాంగ్ లో నటించడానికి మొదట ఒప్పుకోలేదు. కానీ ఈ పాటతో సినిమాలో స్టోరీ కీలక మలుపు తిరుగుతుందని.. సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పడంతో చివరకు ఒప్పుకున్నారట.

ఇక ప్రస్తుతం అనసూయ థ్యాంక్ యూ బ్రదర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా రాబోతుంది. అలాగే కృష్ణవంశీ డైరెక్షన్ లో రంగ మార్తాండ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఖిలాడీ లోనూ నటిస్తుంది. ఇకపై అనసూయ కథకు బలమున్న పాత్రల్లోనే నటిస్తానని తెలిపారు.

Advertisement