బుల్లితెర యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ వెరైటీ షోస్‌తో ప్రేక్షకులని అలరిస్తుంది. జబర్ధస్త్ షోతో అనసూయకు మంచి గుర్తింపు రాగా, దానిని చక్కగా క్యాష్ చేసుకుంటూ వెండితెర వరకు వెళ్లింది. క్షణం, రంగస్థలం, కథనం వంటి చిత్రాలలో అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోను చిందేస్తూ అభిమానుల మనసులని గెలుచుకుంటుంది. ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, థ్యాంక్ యూ బ్రదర్, చావు కబురు చల్లగా, రంగమార్తాండ, పక్కా కమర్షియల్ చిత్రాలలో నటిస్తుంది. మరోవైపు సునీల్ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్టు సమాచారం. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తున్నట్టు టాక్.
అందరి కెరీర్లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. అనసూయ కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతూనే ఉంది. కేవలం తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలోను ఆఫర్స్ దక్కించుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల అనసూయ కోలీవుడ్ చిత్రానికి సైన్ చేయగా, ఇందులో మక్కల సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలోను పాగా వేయాలని భావిస్తుంది. ఇక అనసూయ మలయాళం డెబ్యూకు కూడా దారులు తెరుచుకున్నట్టు కనిపిస్తుంది.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రస్తుతం అమల్ నీరద్ దర్శకత్వంలో భీష్మ పర్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనసూయకు కీలక పాత్ర కోసం ఎంపిక చేసిన్టుట తెలుస్తుంది. అనసూయ గతంలో మమ్ముట్టి నటించిన యాత్ర సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో అనసూయ నటనకు ఇంప్రెస్ అయిన దర్శకుడు తన తాజా చిత్రంకు ఎంపిక చేశాడట. ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుండగా, అనసూయ అప్పుడు కేరళకు వెళ్లనుంది. మొత్తానికి యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా అన్ని భాషలలోను సత్తా చాటేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. రష్మీ, శ్రీముఖి వంటి అందాల భామలు కూడా వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు.