ANASUYA బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ అనసూయకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చలాకీ మాటలతో పాటు అందచందాలతో ప్రేక్షకులని అలరిస్తున్న అనసూయ సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్‌కు వినోదాన్ని పంచుతూ ఉంటుంది. ఇక ఈ అమ్మడు గ్లామర్ షో విషయానికి వస్తే వెరైటీ డ్రెస్సులో వయ్యారాలు పోతూ కుర్రకారుకు హీటెక్కిస్తూ ఉంటుంది. అనసూయ హాట్ పిక్స్‌కు ముగ్దులు కాని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం వెండితెరపై కూడా తన హవా కొనసాగిస్తున్న అనసూయ తాజాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ, రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడి, గోపిచంద్ పక్కా కమర్షియల్, అల్లు అర్జున్ పుష్ప చిత్రాలలో నటిస్తుంది.
అనసూయ లీడ్ రోల్‌లోను ఓ చిత్రం చేసింది. థ్యాంక్యూ బ్రదర్ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ గర్భవతిగా నటించి అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక కార్తికేయ, లావఫ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ స్పెషల్ మాస్ సాంగ్‌తో అలరించనుంది. ఇటీవల దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, ఈ పాట కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ చేస్తుందనే వార్త బయటకు వచ్చాక ఆమె మరి కొన్ని చిత్రాలలోను స్పెషల్ సాంగ్స్‌తో అలరించనుందని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అనసూయ…నేను ఇక స్పెషల్ సాంగ్స్ చేయాలనుకోవడం లేదు. చావు కబురు చల్లగా చిత్రంలోని సాంగ్‌కు నా ఫ్రెండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ కారణంతో ఆ సాంగ్ ఒప్పుకున్నాను. బుల్లితెరపై ఎలాగు గ్లామర్ షో చేస్తున్నాం, ఇక వెండితెరపై స్పెషల్ సాంగ్స్‌తో చేయాల్సిన అవసరం లేదనకుంటున్నాడు. ఇప్పటి నుండి పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ మాత్రమే చేయాలని అనుకుంటున్నాను అని అనసూయ పేర్కొంది. ఈ అమ్మడి మాటలకు కొందరు అభిమానులు ఆవేదన చెందుతున్నారు.