ANASUYA: త‌న భ‌ర్త ఏ జాబ్ చేస్తాడో చెప్పిన అన‌సూయ‌.. అత్త‌గారింటికి వెళ్లినప్పుడు ఆచారాలు పాటిస్తానంటున్న ముద్దుగుమ్మ‌

ANASUYA అందాల బొమ్మ అన‌సూయ ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇప్పుడు న‌టిగాను అల‌రిస్తుంది. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అన‌సూయ స్టార్ హీరోల సినిమాల‌లోను కీ రోల్స్ పోషిస్తూ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ అబిన‌యం అద‌ర‌హో అని చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్ప చిత్రంలోను అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట‌. ఈ పాత్ర ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అలరిస్తుంద‌ని అంటుంది.

యాంక‌ర్‌గా ఉన్న స‌మయంలో త‌న భ‌ర్త‌ని ప్రేమ వివాహం చేసుకున్న అన‌సూయ వీలున్న‌ప్పుడ‌ల్లా హ‌జ్బెండ్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తూ ఉంటుంది. తాజాగా త‌న భర్త ప్రొఫెష‌న్ ఏంటో చెప్పుకొచ్చింది.తన భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నట్లు పేర్కొంది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డానికి కార‌ణం నా భ‌ర్తే అంటుంది అన‌సూయ‌. ఇక అత్త‌గారింటికి వెళ్లినప్పుడు ప‌ద్ద‌తిగా ఉంటాన‌ని, వారి ఆచార సంప్ర‌దాయాలు పాటిస్తాన‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, అన‌సూయ భ‌ర్త నార్త్ ఇండియాకు చెందిన వాడు అనే విష‌యం తెలిసిందే.

Advertisement