ANASUYA: చిరిగిన జీన్స్‌, రెడ్ టాప్‌లో అన‌సూయ సోయ‌గం అద‌రహో..!

ANASUYA అందానికే అసూయ పుట్టేలా చేస్తుంటుంది జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ అన‌సూయ‌. ఈ అమ్మ‌డు ఇప్పుడు టీవీ షోస్‌తోనే కాదు సినిమాలు, సోష‌ల్ మీడియాతోను తెగ సంద‌డి చేస్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అన‌సూయ ఇక అక్క‌డ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. హీరోయిన్స్ క‌న్నా కూడా ఎక్కువ పాపులారిటీ పొందిన అన‌సూయ ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ‌, ఖిలాడి అనే సినిమాలు చేస్తుంది. ఇక మే 7న థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.

ఎప్పుడు స‌రికొత్త ట్రెండ్స్ సృష్టించే అన‌సూయ తాజాగా చిరిగిన జీన్స్, రెడ్ టాప్‌లో హోయ‌లు పోయింది. ఈ డ్రెస్‌లో అన‌సూయని చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. ఇంత యంగ్‌గా క‌నిపిస్తున్నావు, ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అంటే ఎవ‌రు న‌మ్మ‌రు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అన‌సూయ న‌టించిన థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రంలో అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనుండ‌గా, రమేష్ రాపర్తి తెర‌కెక్కించారు. థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్‌ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement