ANASUYA: క‌రోనా దెబ్బ‌కు ఓటీటీ బాట ప‌ట్టిన అన‌సూయ‌.. వ‌చ్చే నెల‌లో సంద‌డ‌కి సిద్ధ‌మైన జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ

క‌రోనా ఎఫెక్ట్ అన‌సూయ‌కు బాగానే త‌గిలింది. ఈ అమ్మ‌డు న‌టించిన థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ చిత్రం థియేట‌ర్స్ లోకి ఎప్పుడు వ‌స్తుందా అని అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో పెద్ద షాక్ ఇచ్చింది చిత్ర బృందం. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా చిత్రాన్ని ఆహాలో మే 7 నుండి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కొద్ది రోజులుగా థ్యాంక్యూ బ్రదర్ సినిమా ను ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలు జోరుగా వ‌స్తుండ‌గా, అవి పుకార్లని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా మేకర్స్ ఇలాంటి షాక్ ఇవ్వ‌డం అన‌సూయ అభిమానుల‌కి మింగుడుప‌డ‌డం లేదు.

సెకండ్ వేవ్ త‌ర్వాత పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యేందుకు క్యూ క‌ట్టాయి. ఈ క్ర‌మంలో చేసేదేం లేదు థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. థ్యాంక్యూ బ్రదర్ సినిమా లో అన‌సూయ‌ని గ‌ర్భ‌వ‌తిగా స‌రికొత్త పాత్ర‌లో చూస్తారని మేకర్స్ అంటున్నారు. అయితే అనసూయ అభిమానులు మాత్రం వెండి తెరపై థ్యాంక్యూ బ్రదర్ ను చూడాలనుకుంటే ఆహా లో స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ స‌మ‌యంలో అన‌సూయ ఓటీటీ బాట మొద‌లు పెట్ట‌గా, రానున్న రోజుల‌లో ఇంకా ఏఏ సినిమాలు ఇదే మార్గాన్ని ఎంచుకుంటాయో చూడాలి.

Advertisement