Anasuya : మీరు ఉప్పు కారం తింటే ఆ పని చేయండి.. విజయ్ ఫ్యాన్స్ పై అనసూయ ఫైర్..!

NQ Staff - May 11, 2023 / 12:43 PM IST

Anasuya  : మీరు ఉప్పు కారం తింటే ఆ పని చేయండి.. విజయ్ ఫ్యాన్స్ పై అనసూయ ఫైర్..!

Anasuya  : ఈ నడుమ సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ పేరు మార్మోగిపోతోంది. అలా అని అదేదో పాజిటివ్ గా అనుకుంటే మీ పొరపాటే.. పూర్తిగా నెగెటివ్ గానే ఆమె పేరు మార్మోగిపోతోంది. ఆమెకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మొదటి నుంచి వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆమె మరోసారి ఆయన ఫ్యాన్స్ న గెలికింది.

ఖుషీ పోస్టర్ లో విజయ్ పేరుకు ముందు THE అని రాసి ఉండటంపై ఆమె సెటైర్లు వేసింది. అయితే ఈ సెటైర్లపై విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఆమెను మళ్లీ ఆంటీ అంటూ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అటు అనసయ కూడా అస్సలు తగ్గట్లేదు. తనమీద వస్తున్న ట్రోల్స్ కు గట్టిగానే సమాధానం చెబుతోంది.

తాజాగా ఆమె ఓ వీడియో బైట్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మీడియా సంస్థలు, విజయ్ ఫ్యాన్స్ మీద మండి పడింది. మీరు కడుపుకు ఉప్పు, కారం తింటే నిజాలు రాయండి. నేను నిజమే మాట్లాడాడు. నా అభిప్రాయం చెప్పాను. పలానా హీరో ఫ్యాన్స్ అనసూయను ట్రోల్స్ చేశారు, వేధించారు ఇవి కాదు మీరు రాయాల్సింది. చేతకాని వాళ్లు అదుపు తప్పారు ఇది మీరు పెట్టాల్సిన థంబ్ నెయిల్ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

ఇంకేముంది ఈ వీడియో చూసిన విజయ్ ఫ్యాన్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. తమను అంత మట అంటావా అంటూ అడిగి కడిగేస్తున్నారు. ఏదేమైనా ఈ రచ్చ ఇప్పట్లో ఆగే విధంగా కనిపించట్లేదు. అనసూయ కయ్యానికి కాలు దువ్వడంతో ఈ గొడవ ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us