Anasuya : అనసూయ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంది.. ఇక డేట్స్ దొరకవు ..?

Anasuya : అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో వరసగా క్రేజీ ఆఫర్ అందుకుంటోంది. మరి కొన్నాళ్ళు ఆగితే ఇక బుల్లి తెరకి గుడ్ బాయ్ చెప్పేస్తుందేమో. ఎందుకంటే అనసూయ క్రేజ్ వల్ల మేకర్స్ సినిమాలలో నటించమని డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. ఒకవైపు ఐటం సాంగ్స్ ..కూడా దుమ్ము దులిపేస్తుంది. అది కూడా పెద్ద హీరోల సినిమాలలో తప్ప చిన్న హీరోల సినిమాలను ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే రంగ మార్తాండ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

anasuya-is-in-tollywood-star-heroine-range
anasuya-is-in-tollywood-star-heroine-range

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రంగ స్థలం సినిమా కంటే ఈ సినిమాలో అనసూయ క్యారెక్టర్ చాలా హైలెట్ అవుతుందని అంటున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చావుకబురు చల్లగా అన్న సినిమాలో కూడా అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అలాగే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప లో కూడా అనసూయ ముఖ్య పాత్రలో కనిపిస్తోందని సమాచారం. ఇలా అనసూయ చేతిలో ఆరేడు సినిమాలున్నాయి. ఇంత బిజీగా ఉన్న అనసూయకి ఇప్పుడు మరో భాష నుంచి కూడా క్రేజీ ఆఫర్ వచ్చిందట.

Anasuya : అనసూయ డేట్స్ దొరకడం కష్టమని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీలో అనసూయ డెబ్యూ కమిటయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కి జంటగా నటిస్తోంది. అంతేకాదు ఈ క్యారెక్టర్ ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుందని సమాచారం. ఇలా తెలుగు, తమిళ సినిమాలతో పాటు బుల్లితెర మీద బిజీగా ఉన్న అనసూయ కి ఇప్పుడు మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి అప్ కమింగ్ మూవీ ‘భీష్మ పర్వం’ సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అంతేకాదు ఈ సినిమా అనసూయ కి మలయాళం లో ఫస్ట్ సినిమా. ఇంతక ముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’లో మమ్ముట్టి లీడ్ రోల్ లో నటించగా ఇదే సినిమాలో అనసూయ కీలక పాత్ర లో కనిపించింది. కాగా ఇప్పుడు ఏకంగా మమ్ముట్టి నటిస్తున్న సినిమాతో స్ట్రైట్ గా మాలివుడ్ లో ఎంటరవబోతోంది. ఇకపై అనసూయ డేట్స్ దొరకడం కష్టమని చెప్పుకుంటున్నారు.

Advertisement