బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అనసూయ అందాల ఆరబోతతో యూత్‌ను కలలో విహరింపజేస్తుంది. ఈ అమ్మడు రెగ్యులర్‌గా ఫొటో షూట్స్ చేస్తూ వాటికి సంబంధించన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో అవి కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా నీలి రంగు చీరలో, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి మత్తెక్కించే చూపులు చూస్తూ కెమెరా ముందు ఫోజులిచ్చింది.
అనసూయని ఇలా చూసిన కుర్రకారుకు గుండెలు జారినంత పనైంది. ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ అనసూయ గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఎవరెన్ని విమర్శలు చేసిన,నెటిజన్స్ నీచమైన కామెంట్స్ చేసినప్పటికీ అనసూయ తాను అనుకున్నదే చేసుకుంటూ వెళుతుంది. కొద్ది రోజుల క్రితం తనకు కరోనా లక్షణాలు కనిపించాయని చెప్పిన అనసూయ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజా ఫొటో షూట్‌ని బట్టి చూస్తుంటే ఆమె కరోనా బారిన పడలేదని అర్దమవుతుంది. అనసూయ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.