ANASUYA: స్టైలిష్ డ్రెస్‌లో సెక్సీగా క‌నిపిస్తున్న అన‌సూయ‌.. ఫొటోలు వైర‌ల్

అందాల అన‌సూయ ఇటు బుల్లితెర‌పైన సంద‌డి చేస్తూనే అటు వెండితెర‌పై వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ అల‌రిస్తుంది. ఇటీవ‌ల చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించిన అన‌సూయ ప్ర‌స్తుతం ఖిలాడి, రంగ‌మార్తాండ చిత్రాల‌లో న‌టిస్తుంది. మ‌రోవైపు అన‌సూయ న‌టించిన థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ అనే సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇందులో అన‌సూయ గ‌ర్భ‌వ‌తిగా క‌నిపించ‌నుండ‌గా, ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్దిన అందాల భామ అన‌సూయ ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియా ద్వారా అల‌రిస్తూనే ఉంటుంది. ట్రెండీ దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసే గ్లామ‌ర్ షో యూత్‌కు కంటిపై క‌నుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా కాఫీ క‌లర్ టాప్, గ్రీన్ క‌ల‌ర్ స్ట‌ర్క్ ధ‌రించి సెక్సీ లుక్స్‌లో ఫొటోల‌కు ఫోజిలిచ్చింది. అన‌సూయ‌ను ఇలా చూసి యువ‌త మైమ‌ర‌చిపోతున్నారు. రోజు రోజుకు వ‌య‌స్సు పెర‌గ‌డం కాదు త‌గ్గిపోతుంద‌ని కామెంట్ చేస్తున్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన‌ప్ప‌టికీ హీరోయిన్స్‌కు పోటీగా అన‌సూయ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేయ‌డం గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి.

 

Advertisement