Anasuya : యువ‌రాణిలా ఫోజులిచ్చిన అన‌సూయ‌.. పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Anasuya  బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఓ వైపు టీవీ షోస్‌, మ‌రోవైపు సినిమాలు, ఇంకోవైపు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంస్ ఇలా మూడింట త‌న హ‌వా చాటుతుంది. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో పాటు ప‌లు టీవీ కార్య‌క్ర‌మాలు చేస్తున్న అన‌సూయ సినిమాల విష‌యంలోను ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే రంగ‌మార్తాండ‌, థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్, చావు క‌బురు చ‌ల్ల‌గా వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌లో న‌టిస్తుంది.

రీసెంట్‌గా అనసూయకు స్వాగతం చెబుతూ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ బుధవారం ట్వీట్ చేశారు. ‘‘మేం మరింత స్మార్ట్‌గా ఆడబోతున్నాం. ఎందుకంటే, ఈ లేడీ ఒక గేమ్ చేంజర్. మా ప్రియాతి ప్రియమైన అనసూయ భరద్వాజ్‌కు స్వాగతం’’ అని రమేష్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే ఖిలాడి చిత్రంలోను అన‌సూయ వినోదాల విందు ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే సినిమాలు, టీవీ షోస్ ఎలా ఉన్న‌ప్ప‌టికి సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోల‌తో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా లంగావోణిలో ప్ర‌త్య‌క్ష‌మైన అన‌సూయ పైట‌ని ఊపుతూ ఫొటోల‌కి ఫోజులిచ్చింది. యువ‌రాణిలా కనిపిస్తున్నావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement