Anasuya : అనసూయ ఫిర్యాదు.! పోలీసులు ఏమన్నారంటే.!
NQ Staff - September 8, 2022 / 08:04 PM IST

Anasuya : నటి అనసూయ భరద్వాజ్, తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారా.? ఫిర్యాదు చేసిన అనసూయకి పోలీసులు ఏం చెప్పారు.?

Anasuya complaint What did the police say
ఈ విషయమై సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై అనసూయ ఘాటుగా స్పందించింది. ‘నీలా మాకు పనీ పాటా లేదు అనుకుంటున్నావా.?’ అని పోలీసులు అనసూయకు చెప్పి పంపించేశారట.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దీనిపై ‘లేదండీ, మీలా పనీ పాటా లేని వాళ్ళకి బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది అని చెప్పారండీ.. మీకు నోరు జారడంలో తొంద ఎలాగూ వుంది.. బోల్తా పడటానికి కూడా తొందే కదా మీకు.. కాస్త ఓపిక పట్టండి.. అన్నీ జరుగుతాయ్.. జరుగుతున్నాయ్..’ అంటూ అనసూయ కామెంట్ చేసింది.
చర్యలు మొదలైనట్లేనా.?
లక్షల సంఖ్యలో ట్వీట్లు అనసూయ మీద జుగుప్సాకరంగా వచ్చాయ్. మరి, వీటన్నిటిపైనా పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రినే వదలడంలేదు కొందరు నెటిజన్స్. అలాంటివారిపైనే చర్యలేమీ వుండటంలేదాయె.
ఏదిఏమైనా, సోషల్ అబ్యూజ్ మాత్రం క్షమించలేనిది. అయితే, ఇలాంటి విషయాల్లో శిక్షలు పడటం, అది ప్రపంచానికి తెలియడం ద్వారా కొంతమేర సోషల్ అబ్యూజ్ తగ్గే అవకాశాలైతే లేకపోలేదు.