Anasuya Bhardwaj : నేను వేశ్య పాత్రలో నటించినా నా పిల్లలు చూస్తారు.. అనసూయ కామెంట్లు వైరల్..!
NQ Staff - June 17, 2023 / 01:52 PM IST

Anasuya Bhardwaj : అనసూయ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మొన్నటి వరకు బుల్లితెరను అల్లాడించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం వెండితెరను ఏలేందుకు రెడీ అవుతోంది. ఎలాగూ బుల్లితెరపై పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె సినిమాలపై బాగానే ఫోకస్ పెడుతోంది. అందుకే సోషల్ మీడియాలో కూడా బాగానే అందాలను ఆరబోస్తోంది.
అయితే ఆమె సినిమాల్లో ఎలాంటి బోల్డ్ పాత్ర వచ్చినా సరే చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గానే ఆమె విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. ఇలాంటి పాత్ర చేయడానికి నిజంగా గట్స్ కావాలి. అందుకే అనసూయను మెచ్చుకోవాల్సిందే. అయితే ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ ఇలాంటి పాత్ర చేస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు.
కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓ రిపోర్టర్ ఆమెను షాకింగ్ ప్రశ్న వేశాడు. ఇలాంటి వేశ్య పాత్రలో మీరు కాస్త బోల్డ్ గా నటించారు కదా.. మరి ఆ సీన్ లను మీ పిల్లలతో కలిసి చూస్తారా అని అడిగాడు. దానికి అనసూయ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నేను నటిగా నిరూపించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను.
ఇది నా ప్రొఫెషనల్. కేవలం నా సినీ కెరీర్. నిజంగానే నా లైఫ్ లో నేను అలాంటి పనులు చేయట్లేదు కదా. కేవలం సినిమా కోసమే చేశాను. కాబట్టి అందులో ఎలాంటి వల్గర్ మీనింగ్ లేదు. కాబట్టి కచ్చితంగా నా పిల్లలతో చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.