Anasuya bharadwaj: కేక పెట్టించే అందాల‌తో మ‌తులు పోగొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్

NQ Staff - January 10, 2022 / 03:03 PM IST

Anasuya bharadwaj: కేక పెట్టించే అందాల‌తో మ‌తులు పోగొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్

Anasuya bharadwaj: ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో అనసూయ ఒకరు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అన‌సూయ వెండితెర‌పై కూడా అద్భుత‌మైన పాత్ర‌లు పోషిస్తూ అల‌రిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మాత్త పాత్రలో అదరగొట్టింది అనసూయ. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

anasuya bharadwaj stunning pics4

anasuya bharadwaj stunning pics4

ఇక ఇటీవల అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో అనసూయ నటించి మెప్పించింది. దాక్షయాణి పాత్రలో మరోసారి తన సత్తా చాటింది అనసూయ. ఇదిలా ఉంటే.. పుష్ప నుంచి విడుదలైన అనసూయ పోస్టర్స్ పై బాడీ షేమింగ్ చేశాయి పలు యూట్యూబ్ ఛానల్స్.

anasuya bharadwaj stunning pics4

anasuya bharadwaj stunning pics4

అనసూయ పోస్టర్స్, లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఆమె చూడు బాగా లావు అయ్యింది.. ఎలా మారిపోయింది అంటూ బాడీ షేమింగ్ చేస్తూ యూట్యూబ్ థంబ్‏నైల్స్ తెగ వైరల్ అయ్యాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్‏కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది అనసూయ.

anasuya bharadwaj stunning pics4

anasuya bharadwaj stunning pics4

అనసూయ భరద్వాజ్ కు కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ సినిమాలో ఒక మంచి ఆఫర్ కూడా వచ్చింది. ఆర్య 2లో శ్రద్దా దాస్ చేసిన పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ మొదట అనసూయనే అనుకున్నాడట.. ఒక ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు అనసూయను చూసిన సుకుమార్ ఆ పాత్రను మీరు చేస్తే బాగుంటుందని కూడా ఆఫర్ ఇచ్చినప్పటికీ అనసూయ అప్పుడు కుటుంబ పరిస్థితుల కోసం ఆలోచించి చేయలేకపోయిందట.

anasuya bharadwaj stunning pics4

anasuya bharadwaj stunning pics4

యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనసూయ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో ఒక మంచి క్రేజ్ అయితే అందుకుంది. కేవలం తన మాటలతో నే కాకుండా తన అందంతో కూడా కుర్రాళ్ళను ఆకర్షించింది. ప్రస్తుతం ఉన్న మోస్ట్ గ్లామరస్ యాంకర్స్ లలో అనసూయ భరద్వాజ్ బెస్ట్ అని చెప్పవచ్చు.

anasuya bharadwaj stunning pics4

anasuya bharadwaj stunning pics4

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న క్యూట్ లుక్స్ షేర్ చేస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాల‌తో అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. అన‌సూయ క్యూట్ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us