Anasuya Bharadwaj: నవరాత్రి స్పెషల్.. ఆరెంజ్ హాఫ్ శారీలో అనసూయ అందాల విందు..

Anasuya Bharadwaj: బుల్లితెరపైన సందడి చేసే యాంకర్స్‌లో ఒకరిగా అనసూయ భరద్వాజ్ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. వెండితెరపైన పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది అనసూయ.

Anasuya Bharadwaj Stunning Photos in Half Saree
Anasuya Bharadwaj Stunning Photos in Half Saree

హాట్ యాంకర్‌గా అనసూయ బుల్లితెరపై చేసే సందడి అందరికీ తెలిసిందే. కాగా వెండితెరపైన మాత్రం అనసూయ చాలా అందంగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటుంటారు. ఈ సంగతులు పక్కనబెడితే అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను అనసూయ పంచుకుంటుంటుంది. తాజాగా అనసూయ దసరా సందర్భంగా నవరాత్రి స్పెషల్‌గా టెలికాస్ట్ అయే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం కోసం స్పెషల్ డ్రెస్ ధరించింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ‘అందం అంటే అనసూయ.. అనసూయ అంటే అందం, బ్యూటిఫుల్ అనసూయ, సంప్రదాయ సోయగం’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya Bharadwaj Stunning Photos in Half Saree
Anasuya Bharadwaj Stunning Photos in Half Saree

ఇకపోతే సదరు ఫొటోల్లో అనసూయ ఆరెంజ్ కలర్ హాఫ్ శారీకి తగు ఆభరణాలు ధరించి ముద్దుగుమ్మలా మెరిసిపోతున్నది. చీరకట్టులో కూడా ఇంత అందంగా ఉంది ఏంట్రా బాబు అనేలా అనసూయ ఉంది. ఇకపోతే అనసూయ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్ర పోషించగా, ఆ పాత్రకు ప్రాణం పోసింది అనసూయ, ఈ సినిమాలో అనసూయ నటనకుగాను మంచి మార్కులే పడ్డాయి. అనసూయ మోడ్రన్ డ్రెస్సులోనే కాదు సంప్రదాయ వస్త్రాల్లోనూ కాకరేపుతుందని నిరూపించింది.

Anasuya Bharadwaj Stunning Photos in Half Saree
Anasuya Bharadwaj Stunning Photos in Half Saree

ఆరెంజ్ కలర్ లంగావోణిలోనూ అనసూయ భరద్వాజ్ పరువాలు విందు చేస్తూ హొయలు పోతున్నది. అనసూయ పలు సినిమాల్లో స్పెషల్ నెంబర్స్‌లోనూ కనిపించింది. ఇటీవల విడుదలైన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. అనసూయ ప్రజెంట్ సుకుమార్ -ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో కీలక పాత్ర పోషిస్తోంది.

Anasuya Bharadwaj Stunning Photos in Half Saree
Anasuya Bharadwaj Stunning Photos in Half Saree