ఏంటి వ్యవహారం వేరేగా ఉందే.. స్టార్ హీరో భుజం పై వాలిన అనసూయ
Admin - December 3, 2020 / 06:31 PM IST
అనసూయ భరద్వాజ్ అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై యాంకర్‌గా ఎంత క్రేజ్ తెచ్చుకుందో.. వెండితెరపై మంచి నటిగా అంతకు పదింతల క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అనసూయకు మాత్రం సోషల్ మీడియాలో ఢీ అంటే ఢీ అనేలా ట్రోల్స్ వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఓ వర్గం మాత్రం అనసూయ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే ట్రోల్స్ చేసేందుకు రెడీగా ఉంటారు.
అయితే అనసూయను దాదాపుగా వస్త్రాధారణ విషయంలోనూ ట్రోల్ చేస్తుంటారు. ఆ మధ్య గోవాలో అనసూయ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. భర్త బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు గోవాకు మకాం మార్చింది. బుల్లి నిక్కర్లు వేసుకుని అక్కడ అనసూయ చేసిన రచ్చ సోషల్ మీడియాలో హీట్‌ను పెంచింది. ఈ మధ్య అనసూయ వర్కవుట్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. గత వారంలో అనసూయ తన కొత్త సినిమా పోస్టర్‌తో ప్రకంపనలు సృష్టించింది.
థాంక్యూ బ్రదర్ అంటూ రాబోతోన్న సినిమాలో అనసూయ గర్భవతిగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉంది. అనసూయ ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. తాజాగా అనసూయ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో సౌత్ స్టార్ విజయ్ సేతుపతితో నవ్వులు చిందిస్తూ ఉంది. విజయ్ భుజం మీద చేతులు వేసి మరీ నవ్వుతోంది. అయితే ఈ ఫోటో ఎందుకు దిగింది? సినిమా చర్చల్లో భాగంగా అతడిని కలిసిందా? అసలు అనసూయ చెన్నైకి ఎందుకు వెళ్లింది అనే విషయాల్లో మాత్రం క్లారిటీ రాలేదు.