Anasuya Bharadwaj: గ‌ట్ల మీద ఫొటోల‌కు ఫోజులిచ్చిన అన‌సూయ‌.. అమ్మ‌డి అందాల‌కు అంతా ఫిదా

Anasuya Bharadwaj: యాంక‌ర్‌గా ప్ర‌స్థానం మొద‌లు పెట్టి ఇప్పుడు బుల్లితెరపై కూడా దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఈ అందాల యాంకరమ్మకు అటు సోషల్ మీడియాలో.. ఇటు బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు.

TheNewsQube-

రంగమ్మాత్త పాత్రలో ఒదిగిపోయి అందరికి ఆకట్టుకుంది అనసూయ. ఈ సినిమా అనంతరం వెండితెరపై అనసూయ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఖిలాడీ, రంగ‌మార్తాండ‌తో పాటు త‌మిళం,మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లోను సినిమాలు చేస్తుంది అన‌సూయ‌.

 

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ దుస్తుల‌లో డిఫ‌రెంట్‌గా ఫొటో షూట్స్ చేస్తుంది. అన‌సూయ అందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతుంటారు.తాజాగా ఈ అమ్మ‌డు డిఫ‌రెంట్ స్టైల్‌లో ఫొటో షూట్ చేసింది. గ‌ట్ల మీద తొడ అందాలు చూపిస్తూ కేక పెట్టించింది.

అన‌సూయ గ్లామ‌ర్ షోని చూసి కుర్ర‌కారు మంత్ర ముగ్దులవుతున్నారు. అయితే ఇటీవ‌ల కోట శ్రీనివాసరావు ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయపై కామెంట్స్ చేశారు. అనసూయ మంచి నటి అని, అందంగానే ఉంటుందని అభిప్రాయ పడ్డారు. అనసూయ డ్రెస్సింగ్ తనకు నచ్చదని పేర్కొన్నారు. అందంగా ఉండే అనసూయ అలాంటి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదని కోట కామెంట్ చేశారు.

‘నీ అనుభవం ఇంత నీఛమా’? అంటూ కోటాపై ఫైర్ అయ్యింది. ఆయన పేరు ప్రస్తావించకుండానే ఏకిపారేసింది. ఏ బట్టలు వేసుకోవాలనేది వ్యక్తిగత ఇష్టం. పెళ్లై పిల్లలున్న స్టార్‌ హీరోలంతా హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్ చేస్తుంటే దాని గురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? హీరోలకు చొక్కా లేకుండా తమ శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకు?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది అనసూయ.