Anasuya Bharadwaj : వాడే నా మీద ట్రోల్స్ చేయిస్తున్నాడు.. విజయ్ తో విభేదాలపై అనసూయ ఫైర్..!
NQ Staff - June 9, 2023 / 11:42 AM IST

Anasuya Bharadwaj : యాంకర్ అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అనసూయ మీద దారుణంగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఆమె కూడా అస్సలు తగ్గకుండా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. అయినా ట్రోల్స్ ఆగట్లేదు. అయితే ఆమె తాజాగా నటించిన విమానం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె విజయ్ తో విబేధాలపై స్పందించింది.
విజయ్ ఫ్యాన్స్ తో నాకు చాలా కాలంగా విబేధాలు నడుస్తున్నాయి. ఈ గొడవలో నేను అలసిపోయాను. నాకు మానసిక ప్రశాంతత కావాలి. అందుకే ఈ గొడవను ఇక్కడితో ఆపేద్దామనుకుంటున్నా. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో లేదో నాకు తెలియదు. కానీ విజయ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి నా మీద ట్రోల్స్ చేయిస్తున్నాడు.
వేరే వారికి డబ్బులిచ్చి మరీ అతను నా మీద ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు చేయిస్తున్నాడని తెలిసింది. ఇదంతా విజయ్ కు తెలియకుండా జరగదు కదా. కానీ నేను అలసిపోయాను. విజయ్ గురించి గానీ, అతని విషయాలను గానీ ఇక నుంచి నేను మాట్లాడను. విజయ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మేమిద్దరం మంచి స్నేహితులం.
కాకపోతే అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ తన ఫ్యాన్స్ అసభ్యకర పదాలను పలికించడం ఒక తల్లిగా నాకు బాధ కలిగించింది. ఆ బాధ నుంచి తేరుకుని ఆయన నిర్మాణంలో ఓ సినిమా కూడా చేశాను. కానీ నా మీద ట్రోల్స్ చేయిస్తారని నేను ఊహించలేదు. ఏదేమైనా ఇక నుంచి నేను ఈ గొడవను ఆపేసి ప్రశాంతంగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నా అంటూ తెలిపింది అనసూయ.