Anasuya Bharadwaj : ఆ విషయం తెలిశాకే విజయ్ మీద పగ పెంచుకున్నా.. అనసూయ కామెంట్లు వైరల్..!
NQ Staff - June 11, 2023 / 11:12 AM IST

Anasuya Bharadwaj : విజయ్ దేవరకొండ-అనసూయ మధ్య వివాదాం మొన్నటి వరకు ఎంతలా సాగిందో మనకు తెలిసిందే. ఈ విషయం మీద విజయ్ ఎన్నడూ స్పందించకపోయినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో అనసూయను ఆడేసుకున్నారు. ఇక అనసూయ కూడా ఏమీ తగ్గకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి.
అయితే రీసెంట్ గా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. విజయ్ తో వివాదాన్ని ఇక ఆపేద్దామని అనుకుంటున్నా అని తెలిపింది. విజయ్ వద్ద ఉండే ఓ వ్యక్తి నా మీద డబ్బులిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడని తెలిసింది. చాలా బాధ పడ్డాను. కానీ ఇక నుంచి ప్రశాంతంగా జీవించేందుకు ఈ వివాదాన్ని ఆపేద్దామని అనుకుంటున్నా అని తెలిపింది అనసూయ.
ఇక లేటెస్టుగా విమానం ప్రమోషన్స్ లో ఈ విషయం మీద మరోసారి క్లారిటీ ఇచ్చింది. నాకు విజయ్ తో మంచి స్నేహం ఉంది. ఆయన నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో కూడా నటించాను. కానీ విజయ్ వద్ద ఉన్న ఓ వ్యక్తి నన్ను డబ్బులిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడని తెలిశాక విజయ్ మీద నాకు తెలియకుండానే పగ పెంచుకున్నాను.
ప్రతి విషయంలో స్పందించాలనే ఆలోచన నాలో డెవలప్ అయింది. నేను ఒక అమ్మాయిని అని కూడా చూడకుండా నన్ను ట్రోల్స్ చేయించారు. కానీ ఇక నుంచి ప్రశాంతంగా జీవించడం కోసమే ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నా అని తెలిపింది అనసూయ.