ఏది ఏమైనా ముందుకు కదలాల్సిందే.. అనసూయ కామెంట్స్ వైరల్
NQ Staff - December 31, 2020 / 03:42 PM IST

అందరూ కొత్త ఏడాది రాబోతోందన్న ఉత్సాహంలో ఉన్నారు. 2020 మిగిల్చిన చేదు అనుభవాలను మరిచిపోయి కొత్త ఏడాది శుభాలు కలగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లతోనూ రెడీ అయ్యారు. ముఖ్యంగా ఈటీవీలో నేటి రాత్రి ఢీజే అంటూ ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

Anasuya About DJ 2021 New Year Special Event
జబర్దస్త్ టీం, ఢీ టీం మధ్య హోరాహోరీ పోరు పెట్టినట్టు ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇరు టీంల మధ్య గొడవలు వచ్చినట్టు.. ఓ చిన్న కాన్సెప్ట్‌తో రెడీ అయ్యారు. జబర్దస్త్, ఢీ మధ్య జరిగే ఈవెంట్ కాబట్టి ఢీజే అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అనసూయ కూడా రానున్న కొత్త ఏడాది, ఢీజే ఈవెంట్ గురించి పోస్ట్ చేసింది.

Anasuya About DJ 2021 New Year Special Event
ఢీజే స్పెషల్ ఈవెంట్, కొత్త సంవత్సరం గురించి అనసూయ ట్వీట్ చేసింది. ప్రతీ ఏడాది మనకు కొత్త ఆరంభం లాంటిదే.. 2020లో ఎలాంటి అనుభవాలు ఎదురైనా గానీ.. అవన్నీ పక్కన పెట్టేసి ముందుకు కదులుదాం.. కొత్త ఏడాదిలో కొత్త ఉద్దేశం, కొత్త లక్ష్యాలు, కొత్త ఉత్సాహంతో ఆరంభిద్దాం.. ఈ ఏడాది చివరి రోజును ఇలా ఎంజాయ్ చేద్దామంటూ ఢీజే ఈవెంట్ గురించి చెప్పింది. ఇక ఈ ఈవెంట్ నేటి రాత్రి అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేలానే ఉంది.