ANASUYA: బ్లాక్ డ్రెస్‌లో అన‌సూయ అందాల ఆరబోత అద‌ర‌హో..!

బుల్లితెర‌పై గ్లామ‌ర్ పంచే అందాల భామ‌ల‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఒక‌రు. ఇద్ద‌రు పిల్ల‌ల త‌లైన కూడా గ్లామ‌ర్ షో విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డ‌కుండా అల‌రిస్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అన‌సూయ ఇక అక్క‌డ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. అన‌సూయ‌కు హీరోయిన్ క‌న్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ‌, ఖిలాడి అనే సినిమాలు చేస్తుంది. ఇక మే 7న థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.

స‌రికొత్తగా స్టైలిష్ డ్రెస్‌ల‌లో క‌నిపించే అన‌సూయ శ‌నివారం రోజు రెడ్ క‌లర్ డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చింది. ఇక కొద్ది సేప‌టి క్రితం బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో త‌ళుక్కుమ‌ని కేక పెట్టిస్తుంది. అన‌సూయ‌ని ఇలా చూసిన నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు. ఇక అన‌సూయ న‌టించిన థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రంలో అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనుండ‌గా, రమేష్ రాపర్తి తెర‌కెక్కించారు. థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్‌ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement