Ananya: అన‌న్య అందాల‌కు ముగ్దులు కాని వారెవ‌రైన ఉంటారా..!

Ananya: సాఫ్ట్ వేర్‌గా పనిచేసే అన‌న్య నాగ‌ళ్ల `మల్లేషం` సినిమాలో ట్రెడిషనల్‌ రోల్‌లో మెరిసి అంద‌రిని అల‌రించింది. ఈ సినిమా త‌ర్వాత అన‌న్యకు వ‌కీల్ సాబ్ చిత్రంలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. చాలా డీసెంట్ గార్ల్‌గా, అయాకురాలిగా కనిపించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అన‌న్య‌తో పాటు నివేదా థామ‌స్, అంజ‌లి వ‌కీల్ సాబ్ చిత్రంలో క‌నిపించిన‌ప్ప‌టికీ అంద‌రి దృష్టి అన‌న్య‌పైనే ప‌డింది.

Ananya Nagalla

వ‌కీల్ సాబ్ చిత్రంతో వ‌చ్చిన క్రేజ్‌ని అన‌న్య చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటుంది. అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా అందాలు ఆర‌బోస్తూ ఫొటో షూట్ చేస్తుంది. ఆ మ‌ధ్య నడుము అందాలను ప్రదర్శిస్తూ నాభిని చూపించి యూత్‌ని రెచ్చ‌గొట్టింది. తెరపై ఎంతో పద్దతిగా కనిపించే అనన్య ఇలా ఎక్స్ పోజ్ చేస్తోందేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అన‌న్య ఎవ‌రేమ‌నుకున్నా త‌గ్గేది లేదంటుంది.

Ananya Nagalla

అన‌న్య‌కి ప్ర‌స్తుతం సినిమా ఆఫ‌ర్స్ ఏమి లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుల‌కి గాలం విసురుతుంది. హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. అన‌న్య ఫొటోలు ఒక‌టిని మంచి మ‌రొక‌టిలా క‌నిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలో అన‌న్య అందాల‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఇక అందాల‌కు సాటిరారెవ్వ‌రు అని కామెంట్స్ పెడుతున్నారు.

Ananya Nagalla

కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వెండితెర దర్శకుల దృష్టిని ఆకర్షించింది అనన్య నాగళ్ల. ప్రియదర్శి హీరోగా.. పద్మశ్రీ చింతకింది మల్లేశం.. బయోపిక్‌గా రూపొందించి ‘మల్లేశం’ అనే సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. అనన్య నటనకు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి.వకీల్ సాబ్ సినిమాలో అనన్య పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండ‌డంతో హైలైట్ ఉంది. తన నిజ జీవితానికి సంబంధించిన పాత్రనే పోషించారు. తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్ల క్యారెక్టర్‌ను అనన్య పోషించారు.

అన‌న్య స్పీడ్ చూస్తుంటే ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో మంచి క్రేజీ ఆఫ‌ర్స్ సంపాదిస్తుందన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇప్ప‌టికే అన‌న్య‌కు కొన్ని క్రేజీ ఆఫ‌ర్స్ ద‌క్కాయని, మ‌రి కొద్ది రోజుల‌లో ఆ సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది.