Ananya Nagalla: పింక్ క‌ల‌ర్ శారీలో క్యూట్‌గా క‌నిపించిన వ‌కీల్ సాబ్ బ్యూటీ

Ananya Nagalla: అనన్య నాగళ్ల.. ఈ అందాల బొమ్మ వ‌కీల్ సాబ్ చిత్రంతో మంచి ఫేమ‌స్ అయింది. మల్లేశం సినిమాతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ… ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. అనన్య నాగళ్ల.. 1996 ఆగస్టు 1న తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది. న్యాయవిద్యలో పట్టాపొంది నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగుపెట్టింది.

ప్లేబ్యాక్​ చిత్రంలోను తన నటనతో ప్రేక్షకులను అలరించింది. కెరీర్ తొలినాళ్ల‌లోనే వ‌కీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఈ ముద్దుగుమ్మ‌కు ద‌క్కింది. ప్రస్తుతం అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది అనన్య నాగళ్ల… అందాల ఆర‌బోత‌లో కూడా ముంబై హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌క్కువ కాద‌ని సిగ్న‌ల్స్ పంపుతుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ క‌ల‌ర్ శారీలో మెరిసింది. అన‌న్య‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ క్యూట్ బ్యూటీ వీలున్న‌ప్పుడ‌ల్లా గ్లామ‌ర్‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. అన‌న్య పిక్స్ చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.