ANAND: టాలీవుడ్ హీరోలలో విజయ్ దేవరకొండ ప్రత్యేకం అనే చెప్పాలి. ఆయన స్టైల్, బాడీ లాంగ్వేజ్, చేసే సినిమాలు అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే కొద్ది రోజుల క్రితం దొరసాని అనే చిత్రంతో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా కాస్త నిరాశపరచినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ ఆనంద్ దేవరకొండకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం పుష్పక విమానం అనే సినిమాతో బిజీగా ఉన్న ఆనంద్ దేవరకొండ ఈ రోజు తన బర్త్‌డే సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు మంచి బర్త్‌డే గిఫ్ట్ అందించారు. మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రానికి బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్ టైన్ మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అలానే హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఓ చిత్రం చేస్తున్నాడు. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి డీటైల్స్ మరి కొద్ది రోజులలో వెల్లడించనున్నారు.