Amitabh: 900 కోట్ల అప్పు చేసిన అమితాబ్.. బెదిరించిన అప్పులోళ్లు

Amitabh: అమితాబ్ బ‌చ్చ‌న్ అస‌లు పేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్. తన పాత్రలతో భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెందిన అమితాబ్ అనంత‌రం లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా పొందారు. నాలుగు దశాబ్దాలలో దాదాపు 180 సినిమాలలో పని చేసిన ఆయ‌న భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల‌లో ఒకరిగా ఉన్నారు. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో అమితాబ్‌కి స్టార్ డం వ‌చ్చింది.

ఇప్పుడు అమితాబ్ ఆస్తుల విలువ కొన్ని కోట్లు ఉంటుంది. త‌రతరాలు కూడా కూర్చొని తినే అంత సంపాదించారు. క‌ష్టం తెలిసిన మ‌నిషి కాబ‌ట్టి ఆయ‌న అప్పుడ‌ప్పుడు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తుంటారు. అడిగిన వారికి లేద‌నకుండా సాయం చేసే మ‌హోన్నత వ్య‌క్తి. ఇప్పుడు అత‌ని జీవితం మూడు పువ్వుల ఆరు కాయ‌లుగా ఉంది. కాని 1999 స‌మ‌యంలో అమితాబ్ గ‌డ్డు కాలం ఎదుర్కొన్నాడ‌ట‌. ఈ విష‌యాల‌ని ఓ లీడింగ్‌ పత్రికచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

1999 స‌మ‌యంలో నేను స్థాపించిన వెంచ‌ర్ దారుణంగా విఫ‌లం కావ‌డంతో దాదాపు 900 కోట్ల రూపాయ‌లు బ‌కాయి ప‌డ్డాను. దీంతో అప్ప‌ల వాళ్లు ఇంటి ద‌గ్గ‌ర‌కు వ‌చ‌చి నీచంగా మాట్లాడ‌డం, బెదిరించ‌డం చేశారు. ఏం చేయాలో తోచ‌లేదు. స‌మ‌స్య నుండి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని నిద్ర లేని రాత్రులు గ‌డిపాను. అలాంటి సమయంలో ఓ సారి కూర్చుని పరిస్థితులను సమీక్షించుకున్నాను. ఏలాగైనా సరే అప్పులన్ని తీర్చాలని నిర్ణయించుకున్నాను.

అదృష్టం కొద్ది ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అప్పు తీర్చుకుంటూ వ‌చ్చాను. అయితే అప్పు ఇచ్చిన వారు నాతో ప్రవర్తించిన పద్దతిని నేను ఎప్పటికి మర్చిపోను. అసభ్య పదజాలంతో దూషించారు.. బెదిరించారు’’ అంటూ చెప్పకొచ్చారు బిగ్‌ బీ. 2000 సంవ‌త్స‌రం అమితాబ్‌కి మ‌ళ్లీ క‌లిసొచ్చింది. య‌ష్‌తో క‌లిసి ఆయ‌న చేసిన మొహబ్బతేన్ మంచి హిట్ కావ‌డంతో ఆయ‌న ఫేట్ మారింది.ఆ తర్వాత నేను ప్రారంభించిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి బాగా క్లిక్‌ అయ్యింది’’ అన్నారు.

78 ఏళ్ల వ‌య‌స్సులోను అమితాబ్ ఉత్సాహంగా ప‌ని చేస్తున్నారు. ఒక వైపు ప్ర‌క‌ట‌న‌లు, మ‌రో వైపు సినిమాలు ఇంకో వైపు కౌన్ బనేగా క‌రోడ్ ప‌తి షో చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యింప‌జేస్తున్నాడు బిగ్ బీ.