AMITABH: మ‌న‌వ‌రాలి కోసం ఖ‌రీదైన డ్యూప్లెక్స్ కొనుగోలు చేసిన మెగాస్టార్..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కొన్ని ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించారు. అంతేకాదు ఆయ‌న సినిమాతైనేమి, ప్ర‌త్యేక షోస్ అయితేనేమి, యాడ్స్ ద్వారా అయితేనేమి కొన్ని కోట్ల రూపాయ‌లు ఆర్జించారు. ఆ సంపాద‌న‌తో ఖ‌రీదైన భ‌వంతులు కూడా కొనుగోలు చేశారు. తాజాగా ముంబై అంధేరిలో ఖరీదైన డూప్లెక్స్ ని కొనుక్కున్నారు. 5184 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ సకల సౌకర్యాలతో .. ఆకాశహార్మ్యాన్ని తలపించే భారీ భవంతిలో 27 – 28 వ అంతస్తులో ఉంది. దాదాపు 31కోట్లు దీని ఖరీదు. 6 కార్ల‌కు స‌రిప‌డే పార్కింగ్ కూడా ఇందులో ఉంద‌ట‌.


ద‌ర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్, సన్నీలియోన్ సహా ఇతర బాలీవుడ్ నటులు కూడా ఈ ప్రాజెక్టులో అపార్టుమెంట్లు కొనుక్కున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. అయితే అమితాబ్ అంత సడెన్ గా ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడం వెన‌క కార‌ణం ఏంట‌ని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. కొంద‌రు తన మనవరాలు ఆరాధ్య బచ్చన్ కి కానుకిస్తున్నారేమో అని అంటుండ‌గా, మ‌రి కొంద‌రు కరోనా క్రైసిస్ కారణంగా ముంబైలో అపార్ట్ మెంట్ల ధరలు తగ్గాయి. స్టాంప్ డూటీని కూడా 5శాతం నుంచి 3 శాతానికి తగ్గించడంతో అమితాబ్ కొనుగోలు చేసి ఉంటార‌ని అంటున్నారు. 2021 గణాంకాల ప్రకారం అమితాబ్ నికర ఆస్తుల విలువ 3322 కోట్లు.. వార్షికాదాయం అత్యంత భారీగా ఉందని అంచనా. అమితాబ్ ప్రస్తుతం గుడ్ బాయ్ అనే చిత్రంతో పాటు ,కేబీసీ 13 సీజన్ కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.