Amit Shah : తెలుగు సినిమా తారకరత్నం: ఎన్టీయార్‌పై అమిత్ షా ట్వీటు వెనుక.!
NQ Staff - August 22, 2022 / 08:54 AM IST

Amit Shah : బీజేపీ సీనియర్ నేత తెలంగాణ పర్యటనలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో డిన్నర్ మీటింగ్ అత్యంత ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరినా, ఆ మీటింగ్ ఇవ్వని కిక్కు బీజేపీ శ్రేణులకు అమిత్ షా – జూనియర్ ఎన్టీయార్ భేటీతో ఇచ్చిందనడం అతిశయోక్తి కాదేమో.!

Amit Shah meeting with NTR and tweet
అత్యంత వ్యూహాత్మకంగా అమిత్ షా ఈ విషయంలో వ్యవహరించారు. తాను ఏం చేస్తే, తెలంగాణ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందో అమిత్ షాకి తెలుసు. అందుకు తగ్గట్టే ఆయన వ్యూహ రచన చేశారని అనుకోవాలేమో.!
తెలుగు సినిమా తారకరత్నం.. తర్వాతేంటి.?
ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీయార్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇంకోపక్క, జాతీయ అవార్డుల్లోనూ యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి ముందు ముందు రాజకీయ ప్రాధాన్యత దక్కబోతోందని అనుకోవచ్చు.
అంతేనా, పద్మ పురస్కారాల విషయంలో కూడా యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి స్పెషల్ రిజర్వేషన్ బహుశా అమిత్ షా అమలు చేస్తారేమో.! ఇలా చాలా చాలా ఊహాగానాలు సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక్క ట్వీటు.. ఒకే ఒక్క ట్వీటు బీజేపీకి అనుకూలంగా యంగ్ టైగర్ ఎన్టీయార్ చేయగలిగితే.. లెక్కలు మారిపోతాయ్.!
ఆ ట్వీటు రత్నం కోసమే, తెలుగు సినిమా తారకరత్నం.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద అమిత్ షా ప్రశంసలు గుప్పించినట్లున్నారు.!