Ram Charan : సర్రియల్ మూమెంట్: ‘నాటు నాటు’కి గోల్డెన్ గ్లోబ్ పురస్కారంపై రామ్ చరణ్.!
NQ Staff - January 11, 2023 / 11:09 AM IST

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికాలో సందడి చేశాడు. ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాన్ని ‘నాటు నాటు’ పాట గెల్చుకోవడంపై రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీయార్, రాజమౌళి, కీరవాణి.. ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కాగా, అమెరికన్ మీడియా.. రామ్ చరణ్‌ని గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల గురించి ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో రామ్ చరణ్, ఇండియన్ సినిమా.. అందునా సౌత్ సినిమా.. అందునా తెలుగు సినిమాకి ఈ స్థాయి ప్రభంజనం చాలా చాలా ఆనందంగా వుందని చెప్పాడు.
అవార్డు వస్తే ఏం చేస్తారు.?

American Media Interviewed Ram Charan About Golden Globe Awards
అవార్డు వస్తే ఏం చేస్తారని మీడియా ప్రశ్నిస్తే, ‘దర్శకుడు రాజమౌళిని అడుగుతా.. కొన్ని రోజులు ఆ అవార్డుని నాతోనే వుంచుకుంటా.. ఆ తర్వాత ఎలాగూ దర్శకుడు రాజమౌళి దాన్ని తీసుకెళ్ళిపోతారు కదా..’ అంటూ నవ్వేశాడు.
అవార్డు దక్కడం సర్రియల్ మూమెంట్ అనీ, వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్‌తో పని చేయడం చాలా చాలా ఆనందంగా వుందని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం రాజమౌళితో పని చేయడంపై ఇంటర్నేషనల్ మీడియాతో రామ్ చరణ్ చెప్పాడు.