Ameer Khan : మూడో పెళ్లికి రెడీ అవుతున్న ఆమీర్ ఖాన్.. ఆశ్చ‌ర్యంలో అభిమానులు

Ameer Khan : 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, దిల్, లగాన్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ , మంగళ్ పాండే, ఫనా, గజిని, పీకే వంటి… బాలీవుడ్ బాక్సాఫీసులను బద్దలుకొట్టిన బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి… తనకంటూ భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అమీర్ ఖాన్.

ameer khan third marriage plans
ameer khan third marriage plans

మార్చి 14, 1965న ముంబైలోని బాంద్రాలో జన్మించారు. అతని మామయ్యా నాసర్ హుస్సేన్ తీసిన యాదోస్ కి బారాత్ (1973) అనే సినిమాలో బాలనటుడిగా నటించి… తెరంగేట్రం ఇచ్చారు ఖాన్. 1988లో చేసిన కయామత్ సే కయామత్ తక్ సినిమా అమీర్ ఖాన్ కు బాలీవుడ్ హీరోగా గుర్తింపును తెచ్చింది. 1990 నుంచి అమీర్ సినిమాలు వరుస కట్టాయి.

ameer khan third marriage plans
ameer khan third marriage plans

2001లో విడుదలైన లగాన్ అమీర్ ఖాన్‌ సూపర్ స్టార్ గా మార్చింది. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చింది. 74వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రగా నామినేషన్ పొందింది. అమీర్ కు ఉత్తమ నటుడి ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది.

అమీర్ ఖాన్ మొదట నటి రీనా దత్తాను 1987లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. పదిహేనేళ్ల అనంతరం వారు విడాకులు తీసుకున్నారు. లగాన్ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావును ఆయన 2005లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావ్ అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు.

ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు దంపతులు ఈ ఏడాది ప్రారంభం​లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమిర్‌ఖాన్‌ మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమిర్‌ఖాన్‌, కరీనా కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రం విడుదలయ్యాక తన మూడో వివాహానికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తారని బీటౌన్‌లో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని ఆమిర్‌ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆమిర్‌ ఖాన్‌ తన సినిమాల్లో బిజీగా ఉన్నాడని తెలిపారు. కాగా, ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావుల మధ్య విభేదాలకు.. ఫాతిమా సనా షేక్‌ కారణమని కూడా సోషల్‌మీడియాలో వార్తలోచ్చాయి. తాజాగా, దీనిపై ఫాతిమా సనా షేక్‌ టీవీ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు.