Amazon: లో దుస్తుల‌తో క‌న్న‌డ జాతీయ జెండా.. మండి ప‌డుతున్న క‌న్న‌డీగులు

Amazon: కొద్ది రోజుల క్రితం గూగుల్ క‌న్న‌డీగుల‌ను చాలా అవ‌మాన‌ప‌ర‌చింది. . ఇండియాలో అత్యంత చెత్త భాష ఏది అని సర్చ్ చేస్తే కన్నడ అని చూపించింది. దీంతో కన్నడిగులు ఫైర్ అయ్యారు. హీరోయిన్ ప్ర‌ణీత క ఊడా తమ మాతృభాషను అలా కించపరడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభాషల్లోకెల్లా కన్నడ అత్యంత ప్రాచీనమైంది.. ఎంతో చరిత్ర ఉందని.. క్వీన్ ఆఫ్ లాంగ్వేజ్ అని గర్వంగా చెప్పుకొచ్చారు. అంద‌రు ముక్త కంఠంతో గూగుల్ త‌ప్పును ఎత్తి చూప‌డంతో దిగి వ‌చ్చిన గూగుల్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఈ సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో వివాదం చోటు చేసుకుంది.

అమెజాన్ సంస్థ క‌న్న‌డ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసింది. పసుపు, ఎరుపు రంగులతో కూడిన కన్నడ జాతీయ జెండాను ను ముద్రించి వాటిని త‌మ వెబ్ సైట్‌లో అమ్మ‌కానికి ఉంచింది అమెజాన్. కెనడాలోని అమెజాన్ యొక్క ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ విష‌యంపై క‌న్న‌డ ప్ర‌ముఖులు సీరియ‌స్ అయ్యారు. అమెజాన్ త‌క్ష‌ణం క్ష‌మాప‌ణ చెప్పాల‌ని లేదంటే న్యాయ పోరాటం చేస్తామ‌ని పేర్కోన్నారు. అశోకచక్రాన్ని సైతం లోదుస్తులపై ముద్రించడంపై తీవ్రంగా ధ్వ‌జం ఎత్తుతున్నారు. ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అమెజాన్ ఆ దుస్తుల‌ను వెంట‌నే త‌న సైట్ నుండి తొల‌గించింది. ఈ అంశంపై రాష్ట్ర కన్నడ శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబావాలి ఆగ్రహం వ్యక్తం చేశారు.

క‌న్న‌డ గౌర‌వాన్ని దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నించిన అమెజాన్ కెన‌డాపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అరవింద్ అన్నారు. బికినీపై క‌న్న‌డ జెండా ముద్రించ‌టమేంటి.. అమెజాన్ త‌క్ష‌ణం క్షమాప‌ణ‌లు చెప్ప‌కపోతే న్యాయ పోరాటం చేసి తీరుతాం అని అర‌వింద్ లింబాయ‌వాలి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇటీవ‌ల గూగుల్ కూడా త‌మ‌ని అవ‌మానించందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌టమ మ‌ర‌వ‌క ముందే క‌న్న‌డ జెండాను అమెజాన్ అవ‌మానించిందంటూ ఆయ‌న ఫైర్ అయ్యారు. మ‌రి అమెజాన్ ఈ వివాదంపై వెంట‌నే స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. బహుళజాతి కంపెనీలు ఈ పద్ధతిలో కన్నడను అవమానించడం మానేయాలని, కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసే పని ఏ కంపెనీ చేయ‌కూడ‌దంటూ ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.