Amazon Prime : కరోనా వలన ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నాయి. మోహన్ లాల్ , వెంకటేష్, నాని, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ ద్వారానే ప్రేక్షకులని పలకరించాయి. ఇక ఇప్పుడు కరోనా ఉదృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్సలో వచ్చిన సినిమాలు తొందరగానే ఓటీటీ బట పట్టాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ సినిమా థియేట్రికల్ గా హిట్ అయ్యిన తర్వాత ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి నాలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చి మళ్ళీ అన్ని భాషల్లోనూ అదరగొడుతుంది.
అయితే ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో మరో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ఇండియాకి ప్రైమ్ వీడియో వాళ్ళకి చిన్న ఫన్నీ ట్విట్టర్ వార్ నెటిజన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. నెట్ ఫ్లిక్స్ వాళ్ళు నిన్న శనివారం వీకెండ్ రాత్రి ఏం చూస్తున్నారు అని తమ వీక్షకులని అడగ్గా..
దానికి పంచ్ వేస్తూ ప్రైమ్ వీడియో వాళ్ళు మీ దాంట్లో ఇప్పుడేం చూడట్లేదు మా దగ్గర పుష్ప చూస్తూ అంతా బిజీగా ఉన్నారు అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. దీనితో ఇది మంచి వైరల్ అయ్యింది. ఇక దీనికి కౌంటర్ ఇస్తూ నెట్ ఫ్లిక్స్ వారు ‘మరి మేము ఆ అందరిలో ఉన్నామా? ఊ అనం ఊ ఊ కూడా అనము’ అంటూ పుష్ప స్టైల్ రిప్లై ఇచ్చారు. దీనితో ఈ కోల్డ్ వార్ నెటిజన్స్ లో మంచి ఎంటర్టైనింగ్ గా మారింది.
ఇక నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం కూడా అతి త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందని అంటున్నారు. ఈ సినిమా మంచి టాక్ అందుకొని సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Are we “everyone”?
Ooh anam. Kaani oohoo kooda anam 👀 https://t.co/jWwH6Y8nmw
— Netflix India (@NetflixIndia) January 8, 2022