Amani: నువ్వు అందెగ‌త్తెవు కావు అనే స‌రికి క‌న్నీళ్లు పెట్టుకున్న ఆమ‌ని

Amani: మేటి క‌థానాయిక ఆమ‌ని తెలుగు తెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయం లిఖించుకున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్‌ ఆరంభంలోనే ‘జంబలకిడిపంబ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించారు. ఎలాంటి అందాల ఆరోబోత‌కు పోకుండా ప‌ద్ద‌తిగా ఉండి ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోను స‌త్తా చాటుతున్న ఆమ‌ని సినిమాలు , సీరియ‌ల్స్ చేస్తుంది.


Amani became Emotional in Alitho Saradaga Show
Amani became Emotional in Alitho Saradaga Show

తాజాగా ఆమ‌ని తన స్నేహితురాలు, నటి ఇంద్రజతో కలిసి ‘ఆలీతో సరదాగా’లో సందడి చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో ఇంద్రజ, ఆమని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐదేళ్ల వయసు నుంచే తనకి సినిమాలు అంటే ఇష్టమని.. స్కూల్‌లో చదవడం మానేసి శ్రీదేవి, జయప్రద, జయసుధల గురించే ఎక్కువగా ఆలోచించేదాన్ని అని ఆమని తెలిపారు.

దొంగిలించిన మామిడికాయలు తినడమంటే తనకెంతో ఇష్టమన్నారు. అనంతరం తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక.. మా కుటుంబానికి ఆ విషయం చెప్పాను. మా బంధువులందరూ విమర్శించారు. ‘అది సినిమాల్లో చేయడమేమిటి?ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదు, పెద్ద అందగత్తె ఏం కాదు’’ అని అన్నారని చెబుతూ బాధ‌ప‌డింది.

తనకు అవకాశాలు వచ్చినప్పటికీ చిన్న చిన్న పాత్రలలో నటించనని చెప్పింది ఆమని. కాగా ప్రస్తుతం సీనియర్ నటి ఆమని జీ తెలుగులో ప్రసారం అవుతున్న ముత్యమంతా ముద్దు సీరియల్ లో డబ్బు ఆశ ఉన్న అత్తగా నటిస్తుంది. మరి ఈ సీరియల్ ఏ స్థాయిలో సూపర్ హిట్ అవుతుందో చూడాలి.