Amala paul: హాలీవుడ్ హీరోయిన్‌లా మెరిసిపోతున్న అమ‌లాపాల్‌.. ఆ అందానికి ఎవ‌రైన ముగ్ధులు కావ‌ల్సిందే..!

Amala paul: అందాల ముద్దుగుమ్మ అమ‌లాపాల్ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ నెస్‌తో అద‌ర‌గొడుతూ ఉంటుంది. అమలాపాల్‌ గ్లామర్‌ విషయంలో తనకు ఎలాంటి హద్దుల్లేవని నిరూపించుకుంటుంది. అవకాశం దొరికినప్పుడలా స్కిన్‌ షో విషయంలో రెచ్చిపోతుంది. ఇంటర్నెట్‌లో ఫైర్‌ అంటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ హీరోయిన్ మాదిరిగా క‌నిపిస్తూ కేక పెట్టిస్తుంది.

amala paul stylish pics1
amala paul stylish pics1

అమ‌లాపాల్ కారు ద‌గ్గ‌ర నిలుచొని ఫొటోకి ఫోజులివ్వ‌గా, ఈ గెట‌ప్‌లో ఆమెని చూసిన కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. చాలా హాట్ హాట్‌గా క‌నిపిస్తున్న అమ‌లాపాల్‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందం ఇది అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమ‌లా పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఒక‌ప్పుడు తెలుగులోను అల‌రించిన అమ‌లాపాల్ ఇప్పుడు మ‌ల‌యాళంలో ర‌చ్చ చేస్తుంది. ముఖ్యంగా ఆమె విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి చాలా స్ట్రాంగ్‌గా మారింది. తనకు నచ్చిన పాత్రలు చేస్తుంది. నటిగా, గ్లామర్‌ పరంగా మరింతగా ఓపెన్‌ అవుతుంది. అందులో భాగంగానే ఆమె ఆ మధ్య `ఆమె` అనే చిత్రంలో న్యూడ్‌ రోల్ చేసింది.

అమలాపాల్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె గ్లామర్‌ పాత్రలను దాటుకుని తన పాత్ర ప్రధానంగా సాగే చిత్రాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం `ఆదు జీవితం`, `అదో అంధా పారవై పోలా`, `కడేవర్‌` చిత్రాల్టో నటిస్తుంది.

amala paul stylish pics1
amala paul stylish pics1

ప్రతిభకి కలర్‌ ముఖ్యం కాదని నిరూపించింది అమలాపాల్‌. టాలెంట్‌ ఉంటే దేన్నైనా అధిగమించవచ్చని నిరూపించింది. అంతేకాదు డస్కీగా ఉన్నా హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంటుంది అమలాపాల్‌. తన అందాలకు ఫిదా అయిన అభిమానులు కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.