Amala Paul: నాగార్జున‌తో లిప్ లాక్‌కి సై అంటున్న డ‌స్కీ బ్యూటీ.. చిన్న‌కండీష‌న్ కూడా పెట్టిందిగా..!

Amala Paul: కింగ్ నాగార్జున కుర్రాళ్లకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న ఇటీవ‌లి కాలంలో న‌టించిన చాలా చిత్రాలు ఫ్లాప్స్ అయ్యాయి. ప్ర‌స్తుతం బంగార్రాజు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతుంది.

TheNewsQube-
Amala Paul Ready to Liplock with Nagarjuna
Amala Paul Ready to Liplock with Nagarjuna

బంగార్రాజు సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. చైతూకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ సినిమాకు గోస్ట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

నాగార్జున నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘ఘోస్ట్’. ప్రతిభావంతుడైన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గరుడ వేగ’ చిత్రంతో ప్రవీణ్ సత్తారు అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంద‌రిలో భారీగా అంచ‌నాలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల కాజల్ ‘ఘోస్ట్’ మూవీ నుంచి తప్పుకుంది. దీనితో కాజల్ ప్లేస్ భర్తీ చేసేందుకు చాలా మంది హీరోయిన్లని పరిశీలించారు.

చివరకు డస్కీ బ్యూటీ అమలాపాల్ ని ఫిక్సయ్యారు. సాంగ్ లో వీరిద్దరూ రొమాన్స్ చేస్తారని వినికిడి. అందమైన హిల్ స్టేషన్ లో ప్రవీణ్ ఈ సన్నివేశాలని చిత్రికరించబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో నాగార్జునతో అమలాపాల్ లిప్ లాక్ సీన్ కూడా ఉండబోతున్నట్లు హాట్ న్యూస్.

లిప్ లాక్ సన్నివేశానికి అమాలాపాల్ కండిషన్ పెట్టిందట. ఆ సీన్ లో నటించాలంటే అదనపు రెమ్యునరేషన్ ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. దీనితో మేకర్స్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అమలాపాల్ ఇటీవల బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. ‘ఆమె’ చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.