Amala paul: అమ‌లాపాల్ క‌ట్టుకున్న చీర ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మ‌డం ఖాయం..!

Amala paul: మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అమ‌లాపాల్ ప్ర‌స్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు.

amala-paul cute pics
amala-paul cute pics

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలోన్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది.

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ శారీలో మెరిసింది. ఈ శారీ ధ‌ర వింటే క‌ళ్లు బైర్లు క‌మ్మ‌డం ఖాయం.

ఈ మ‌ధ్య రెడీ టు వేర్‌ చీర డిజైన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవలోనిదే ఈ చీర. ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్‌కు ముందుగానే కుచ్చులను కుట్టేస్తారు. దీనితో పాటు స్టిచ్డ్‌ బ్లౌజ్, ఒక కాలర్, ఒక బెల్టు కూడా ఉంటుంది.నికిత విశాఖ ఈ చీర‌ని డిజైన్ చేయ‌గా, దీనిని 46 వేల రూపాయ‌లు ఉంటుంద‌ని స‌మాచారం.

amala-paul cute pics1
amala-paul cute pics1

మార్వాడీ కుటుంబానికి చెందిన నికిత, విశాఖ అనే ఇద్దరు తోడికోడళ్ల గొప్ప పనితనమే ఈ ఫ్యాషన్‌ హౌజ్‌. అత్తింటి వారికి మహారాష్ట్రలో ఓ పెద్ద వస్త్ర పరిశ్రమ ఉంది. దాదాపు దశాబ్దంపాటు అదే వృత్తిలో ఉన్న వారి భర్తలను చూసి.. వస్త్ర ప్రపంచంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఇంటరెస్ట్‌కు కాస్త సృజనాత్మకతను జోడించి తమ దుస్తులను తామే డిజైన్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. గుర్తింపు, మెప్పు వస్తూండడంతో ‘నికిత విశాఖ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించారు.