Amala Paul : డబ్బుల కోసం నీచమైన పని చేసిన అమలాపాల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!
NQ Staff - June 10, 2023 / 12:46 PM IST

Amala Paul : హీరోయిన్ అమలా పాల్ ఎలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటుందో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ ఆమె చేజేతులా తన క్రేజ్ ను పోగొట్టుకుంది. పెండ్లి అయి విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది ఈ భామ. ఈ నడుమ ఇలాంటివి మరీ ఎక్కువ అయ్యాయి.

Amala Paul Caught Yet Another Controversy
ఆమెకు సినిమా నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా వెనకాడదు. గతంలో అమలా పాల్ సినిమాలో ఆమె బట్టల్లేకుండా నటించి అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరో కాంట్రవర్సీలో ఇరుక్కుంది. గ్యాంబ్లింగ్ క్రీడ అయిన క్యాసినో బ్రాండ్ ని ప్రమోట్ చేసింది తాజాగా. ఆ కంపెనీ ఇచ్చిన ప్రమోషన్ పార్టీలో పాల్గొంది.

Amala Paul Caught Yet Another Controversy
తమ ప్రమోషన్స్ కోసం ఆ కంపెనీ కొందరు మోడల్స్, నటీమణులను ఎంపిక చేసుకుంది. అందులో అమలాపాల్ కూడా ఉంది. ఈ ప్రమోషన్ ఈవెంట్ కు అమలాపాల్ చాలా అసభ్యకరమైన డ్రెస్ వేసుకుని వెళ్లింది. అందులో ఆమె ఎద, థైస్ అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. పైగా ఫుల్ మూడ్ లో చిందులేసింది.

Amala Paul Caught Yet Another Controversy
అంతే కాకుండా క్యాసినో ఆడుతూ తెగ నవ్వులు ఒలకబోసింది. ఇది చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి చెత్త పని చేస్తావా.. డబ్బులిస్తే ఎలాంటి నీచమైన పని అయినా చేస్తావా అంటూ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. నీలాంటి వారి వల్లే సమాజం చెడిపోతోందని అంటున్నారు. మరి ఈ వివాదంపై అమలా పాల్ ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.