Allu Sneha: బ‌న్నీ వైఫ్‌లో ఈ టాలెంట్ దాగుంద‌ని మీలో ఎంద‌రికి తెలుసు..!

Allu Sneha:ఒక‌ప్పుడు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా చూశాక ఆ ట్యాగ్ లైన్ బ‌న్నీకి స‌రిగ్గా సరిపోతుంద‌ని మీరే అనుకుంటారు అని సుకుమార్ ఓ సంద‌ర్భంలో చెప్పారు. అయితే బ‌న్నీకి తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ప‌క్క రాష్ట్రాల‌లోను మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న హీరో కాబ‌ట్టి బ‌న్నీకి ఆ క్రేజ్ ఉండ‌డం ఖాయం. కాని బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి వారి పిల్ల‌లు అయాన్, అర్హ‌ల‌కు సైతం చాలా ఫాలోయింగ్ ఉంది.

Allu Sneha Reddy Risky Yoga Poses (1)
Allu Sneha Reddy Risky Yoga Poses

స్నేహా రెడ్డి ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేర్ ఫీట్ సాధించిన విష‌యం తెలిసిందే. ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య 4 మిలియ‌న్స్ దాటింది. ఫిలిం బ్యాక్‌గ్రౌండ్‌లోని ఏ హీరో భార్య‌కు అంత ఫాలోయింగ్ లేక‌పోవ‌డంతో అయామ్‌ ది రియల్ క్వీన్ అంటుంది స్నేహా రెడ్డి. ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ లేని ఏ హీరో భార్యకూ ఇంత ఫాలోయింగ్ లేదు. సినిమాతో మమేకమైన చైతూ-సమంత జోడీని పక్కకుపెడితే.. తారక్‌ భార్య లక్ష్మీ ప్రణతి, గతంలో సినిమాల్లో చేసి.. ఇప్పటికీ సినిమా పరిశ్రమతో టచ్‌లో వున్న మహేష్‌ వైఫ్ నమ్రత స్కోర్‌ని కూడా ఎప్పుడో క్రాస్ చేశారు అల్లు స్నేహ.

స్నేహా రెడ్డి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్ దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఎక్కువ‌గా త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉండే స్నేహా రెడ్డి తాజాగా తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు. యోగాలో ఎప్ప‌టి నుండో శిక్ష‌ణ తీసుకుంటున్న స్నేహా రెడ్డి తాజాగా త‌ల‌కిందులుగా ఫీట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స్నేహా ఫృట్స్‌కి క‌ళ్యాణ్ దేవ్ షాక్ అయ్యాడు. మొత్తానికి చేసేసావ్ అంటూ కామెంట్ పెట్టాడు.

Allu Sneha Reddy Risky Yoga Poses
Allu Sneha Reddy Risky Yoga Poses

గ‌తంలో ఆదాశ‌ర్మ‌, మంచు ల‌క్ష్మీతో పాటు ప‌లువురు అందాల భామ‌లు ఇలాంటి ఫీట్స్ చేసి అభిమానుల ప్ర‌శంస‌లు పొందారు. ఇప్పుడు స్నేహా రెడ్డి త‌న‌దైన స్టైల్‌లో ఈ ఫీట్ చేసి అంద‌రిచే ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ఇక స్నేహా రెడ్డి రీసెంట్‌గా అల్లు అర్హకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో షేర్ చేయ‌గా తెగ వైరల్‌ అవుతోంది. రీసెంట్‌గా బన్నీ ఫ్యామిలీలో ఓ ఫంక్షన్‌ జరిగింది. ఆ ఫంక్షన్‌లో తన కూతురిని రెడీ చేయిస్తున్న ఓ వీడియోని షేర్‌ చేసింది స్నేహ. అందులో అర్హ పాప క్యూట్‌ స్మెల్‌ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.