Allu Sirish : అనూ ఇమ్మాన్యుయేల్‌తో రొమాన్స్: అస్సలు ఇబ్బంది పడలేదన్న అల్లు శిరీష్.!
NQ Staff - October 19, 2022 / 04:38 PM IST

Allu Sirish : అనూ ఇమ్మాన్యుయేల్‌తో అల్లు శిరీష్ ప్రేమలో పడ్డాడా.? ఇద్దరూ డేటింగులో వున్నారా.? త్వరలో ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారా.? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ ప్రశ్నలు వాటి చుట్టూ బోల్డన్ని గాసిప్స్ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ కలిసి ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో నటించారు. ఈ సినిమాకి తొలుత ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ పెట్టి, ఆ తర్వాత మార్చారు. సినిమా స్టిల్స్ హాట్ అండ్ వైల్డ్‌గా వుండటంతో, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కాస్తా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీగా మారిందనే ప్రచారం తెరపైకొచ్చింది.
జస్ట్ ఆన్ స్క్రీన్ రొమాన్స్..
తనకూ అనూ ఇమ్మాన్యుయేల్‌కీ మధ్య ప్రేమా, గీమా ఏమీ లేదని తేల్చేసిన అల్లు శిరీష్, ‘ఇద్దరం కలిసి ఓ సినిమాలో పని చేశాం కాబట్టి, ఇలాంటి రూమర్స్ రావడంలో వింతేమీ లేదు’ అనేశాడు. ‘చాలా సినిమాల విషయంలో చాలామంది నటీనటుల విషయంలో ఇలాంటి గాసిప్స్ వస్తుంటాయ్’ అని లైట్ తీసుకున్నాడు అల్లు శిరీష్.
‘ఆమె నాకు మంచి స్నేహితురాలు.. ఆమె కూడా నాలాగే సైలెంటుగా వుంటుంది. వర్క్ విషయంలో చాలా ప్రొఫెషనల్. సినిమా సందర్భంగా ఏర్పడ్డ పరిచయం మాత్రమే. అంతకు మించి మా ఇద్దరి మధ్యా ఏమీ లేదు..’ అని అల్లు శిరీష్ స్పష్టతనిచ్చాడు. నవంబర్ 4న ‘ఊర్వశివో ప్రేయసివో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.