Nikhil: నిఖిల్‌కు పెద్ద సాయ‌మే చేసిన అల్లూవారాబ్బాయి..!

Nikhil: తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరూ మంచి స్నేహితులే. బయట అభిమానులు కొట్టుకుంటారు కానీ హీరోలు మాత్రం చాలా స్నేహంగా ఉంటారు. మరీ ముఖ్యంగా ఒకరి అవకాశాలు మరొకరు ఇప్పించేలా ఉంటారు. యంగ్ హీరోలు అందరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉంటారు. ఈ జాబితాలో అల్లు శిరీష్ అందరికంటే ముందు ఉంటాడు. తన స్నేహితుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అల్లు వారబ్బాయి.

Nikhil

అవసరమైతే తన బ్యాగ్రౌండ్ కూడా బాగానే వాడతాడు. ఇప్పుడు మరో కుర్ర హీరో, తన స్నేహితుడు నిఖిల్ కోసం ఇదే చేశాడు. ఈ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. ఎప్పటి నుంచో శిరీష్, నిఖిల్ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునే క్లోజ్ ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే తన పెళ్ళికి ముందు డేటింగ్ చేస్తున్న విషయాన్ని కూడా ముందుగా అల్లు శిరీష్ తోనే పంచుకున్నాడు నిఖిల్.

తన వ్యక్తిగత విషయాన్ని తన స్నేహితుడికి మాత్రమే చెప్పుకున్నాడు. ఇదే విషయాన్ని ఈ మధ్య నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా బయటపెట్టాడు అల్లు శిరీష్. నువ్వు పల్లవితో ప్రేమలో ఉన్న విషయాన్ని ముందు నాకే చెప్పావు.. నువ్వు ఎప్పుడూ ఇంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను నిఖిల్ అంటూ తన విషెస్ చెప్పాడు అల్లు శిరీష్. దీనికి నిఖిల్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతుంది.

Nikhil

నాకు తెలిసి నువ్వు బెస్ట్ ఫ్రెండ్.. నీ బర్త్ డే విషెస్ కు థాంక్యూ బ్రదర్.. నువ్వు చేసిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నా సినిమా ఫస్ట్ లుక్ నీకు నచ్చింది అనుకుంటా అంటూ రిప్లై ఇచ్చాడు నిఖిల్. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో 18 పేజెస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అవకాశం నిఖిల్ కు రావడానికి అల్లు శిరీష్ ప్రధాన కారణం అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

తన తండ్రి అల్లు అరవింద్ కు స్నేహితుడిని పరిచయం చేయడమే కాకుండా సినిమా అవకాశం వచ్చేలా చేశాడని సన్నిహితుల నుంచి తెలిసిన సమాచారం. కేవలం నిఖిల్ విషయంలోనే కాదు తన స్నేహితులు చాలా మందికి ఇలా సాయం చేస్తూనే ఉన్నాడు అల్లు శిరీష్. అందుకే ఈయనకు కూడా ఒక మంచి విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.