ముంబైలో ఆటో న‌డుపుతున్న అల్లూ వార‌బ్బాయి… కార‌ణం ఏమై ఉంటుంద‌బ్బా!

సినీ ఇండ‌స్ట్రీలో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌కు ఎంత ప్ర‌త్యేక గుర్తింపు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేవ‌లం మెగా హీరోస్‌తోనే కాకుండా ఇత‌ర హీరోస్‌తోను బ‌డా సినిమాలు తీసి విజ‌యం సాధించారు. నిర్మాత‌గా స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న అర‌వింద్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆహా అనే ఓటీటీ సంస్థ‌ను లాంచ్ చేసి దాని ద్వారా ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందించే ప్ర‌యత్నం చేస్తున్నారు. అయితే అల్లు ఫ్యామిలీలో అల్లు అర‌వింద్ త‌ర్వాత అంత ఫేమ్ అయింది అల్లు అర్జున్. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న అల్లు అర్జున్ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు.

అల్లు అర‌వింద్ రెండో కొడుకు, బ‌న్నీ సోద‌రుడు అల్లు శిరీష్ హీరోగా రాణించేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్న‌ప్ప‌టికీ స‌రైన స‌క్సెస్‌లు రావ‌డం లేదు. ‘గౌరవం’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన శిరీష్.. ‘కొత్త జంట’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘ఒక్క క్షణం’ వంటి సినిమాల్లో నటించినా కెరీర్ కి ఏ మాత్రం హెల్ప్ అవలేదు. మ‌ల‌యాళ రీమేక్‌గా తెర‌కెక్కిన ఏబీసీడీ చిత్రం దారుణంగా ప్లాప్ కావ‌డంతో కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్నాడు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల‌ని ఆస‌క్తిక‌ర క‌థ‌లు వింటున్నాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ గా కనిపించి అంద‌రిని అల‌రించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడ‌ట‌.

ఆటోడ్రైవ‌ర్‌గా న‌టించి చిరంజీవి, ర‌జనీకాంత్ వంటి స్టార్స్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించారు . ఇప్పుడు అల్లు శిరీష్ కూడా ఆటో డ్రైవ‌ర్‌గా ఓ సినిమాలో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇటీవలే ముంబైలో అల్లు శిరీష్ ఆటో డ్రైవర్ గా మారి ఓ డ్యాన్స్ వీడియో షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం శిరీష్ చేస్తున్న చిత్ర షూటింగ్ 60 శాతం షూటింగ్ ముగిసినట్లు సమాచారం. కొంత భాగం షూటింగ్ జరిగిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించాలని అల్లు శిరీష్ డిసైడ్ అయ్యాడ‌ని స‌మాచారం.. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ కూడా రివీల్ చేయ‌నున్నార‌ట‌.

Advertisement