Allu Arjun మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అయినప్పటికీ, కష్టాన్ని నమ్మకాన్ని టాప్ హీరోగా ఎదిగాడు. మధ్యలో ఫ్లాపులు పలకరించినప్పటికీ, ఏ మాత్రం బెదరకుండా మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు కదిలాడు. అల్లు ఫ్యామిలీ నుండి బన్నీ, శిరీష్‌లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా శిరీష్ పెద్దగా ప్రతిభ కనబరచలేకపోయాడు. ఇక అరవింద్ మరో తనయుడు బాబీ నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైన అల్లు ఫ్యామిలీలో బన్నీకు ఉన్న క్రేజ్ ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పుడు ఇదే క్రేజ్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా పొందేలా ఉన్నాడు.
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల కొడుకు అయాన్ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకపోయిన నెటిజన్స్‌కు చాలా సుపరిచితం. అయాన్ చిలిపి చేష్టలు, అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను ఇటు అల్లు అర్జున్ లేదంటే స్నేహా రెడ్డి తమ సామాజిక మాధ్యమాలలో తరచు పోస్ట్ చేస్తుంటారు. ఇవి నెటిజన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంటాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములోని ఓ మై గాడ్ డాడీ సాంగ్ ప్రమోషన్ లో భాగంగా అయాన్, అర్హలు ఆడిపాడి అలరించిన సంగతి తెలిసిందే. ఇందులో వీరిద్దరిని చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. తాజాగా అయాన్ తన అల్లు ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలతో కలిసి గ్రూప్ ఫొటో దిగాడు. ఇందులో క్యూట్ స్మైల్‌తో కనబడుతూ నెటిజన్స్ మనసు దోచుకుంటున్నాడు.
అల్లు వారి ఫ్యామిలీలో చిన్న పిల్లల గ్యాంగ్ పెద్దగానే కనిపిస్తుండగా, వీరందరిని అయాన్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బాక్సాఫీస్ రారాజుగా ఓ వెలుగు వెలుగుతున్న అల్లు అర్జున్ మాదిరిగానే అయాన్ కూడా అదరగొడతాడని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. రంపచోడవరం పరిసర ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఆగస్ట్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రష్మిక మాంధాన ఇందులో కథానాయికగా నటిస్తుంది.