Ayaan: చెల్లెలి కోసం బాహుబ‌లిలా మారిన బ‌న్నీ త‌న‌యుడు

Ayaan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ స్థాయికి చేరుకోవ‌డానికి ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గంగోత్రి సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ‌న్నీ న‌ట‌న‌లోను, డ్యాన్స్‌లోను యాక్ష‌న్ సీక్వెన్స్‌లోను ఎంతో పరిణితి క‌న‌బ‌రుస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. టాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్ ట్రై చేసిన తొలి హీరోగా బ‌న్నీ నిలిచాడు. ఇప్పుడు ఈ హీరోకు తెలుగులోనే కాదు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను ఫుల్ పాపులారిటీని పొందాడు.

Ayaan

బ‌న్నీ ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రం రెండు పార్ట్‌లుగా రానుంది. ఇందులో లారీ డ్రైవ‌ర్‌గా డీ గ్లామ‌ర‌స్ లుక్‌లో కనిపించి అల‌రించనున్నాడు. ఈ సినిమాతో బ‌న్నీకి ఓ రేంజ్‌లో ప్రేక్ష‌కాద‌ర‌ణ రావ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. పుష్ప సినిమా నుండి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మార‌బోతున్నాడు.

Ayaan

బ‌న్నీ ఎంత ప్రొఫెష‌న‌ల్ ప‌ర్స‌నో అంత‌కు మించి ఫ్యామిలీ ప‌ర్స‌న్. త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దా స‌మ‌యం స్పెంట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు వారి అల్లరికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. అలానే బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి కూడా త‌మ పిల్ల‌ల ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ నేప‌థ్యంలో అయాన్, అర్హ‌కు అతి త‌క్కువ టైంలోనే ఫుల్ క్రేజ్ ద‌క్కింది. సోష‌ల్ మీడియాలో అయాన్ లేదా అర్హ ఫొటో పోస్ట్ అయిందో అది కొద్ది నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంది.

టాలీవుడ్ స్టార్ హీరోల సతీమణుల్లో అల్లు స్నేహారెడ్డి ముందున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లున్న సెలెబ్రిటీగా స్నేహారెడ్డి రికార్డ్ క్రియేట్ చేశారు. అల్లు స్నేహారెడ్డికి ప్రస్తుతం ఇన్ స్టాగ్రాంలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అల్లు అర్జున్, అయాన్, అర్హలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండే స్నేహా రెడ్డి తాజాగా మ‌రో పిక్ షేర్ చేసింది.

Ayaan

ఇందులో అయాన్ త‌న చెల్లెలి కోసం బాహుబ‌లిలా మారాడు. చెల్లెలిని భుజాల‌పై ఎత్తుకొని తిప్పేస్తున్నాడు. వీరి అనుబంధాన్ని స్నేహా రెడ్డి కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది స్నేహా రెడ్డి. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ క్యూట్ పిక్‌పై బ‌న్నీ అభిమానులు జూనియ‌ర్ బాహుబ‌లి అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ మ‌ధ్య బుల్లి బైక్ మీద చెల్లిని ఎక్కించుకుని ఇంట్లోనే షికార్లు కొట్టేశారు అల్లు అయాన్, అర్హ. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైర‌ల్‌గా మారింది.