SS Rajamouli : బన్నీతో రాజమౌళి మూవీ తీయకపోవడానికి కారణం అతనే.. అంత మోసం చేశాడా..?
NQ Staff - January 28, 2023 / 09:58 AM IST

SS Rajamouli : రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని అంతా ఆశ పడుతున్నారు. ఆ రేంజ్ లో జక్కన్న ఫాలోయింగ్ ఉంది. ఈ విషయం ఎవరిని అడిగినా సరే ఇట్టే చెప్పేస్తారు. రాజమౌళి ఒక సినిమా తీస్తే ఇప్పుడు హాలీవుడ్ కూడా ఇటువైపు చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది.
అలాంటి రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం అనేది ఒక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవాలి. ఇక తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ అందులో ఓ ముగ్గురు స్టార్ హీరోలతో మాత్రం ఆయన సినిమాలు చేయట్లేదు. ఆ ముగ్గురులో చిరంజీవి, పవన్ కల్యాణ్, బన్నీ ఉన్నారు. చిరంజీవికి అంటే వయసు ఎక్కువ కాబట్టి ఆయనతో రిస్కీ షాట్లు తీయలేమని జక్కన్న సినిమా చేయట్లేదు.
బన్నీ రెడీగా ఉన్నా…
ఇక పవన్ అంటే రాజకీయాల్లో చాలా బిజీ కాబట్టి రెండు, మూడేండ్లు కేటాయించే పరిస్థితులు లేవు. మరి బన్నీ సినిమా కోసం ఏం చేయడానికి అయినా రెడీగా ఉన్నాడు. రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశిస్తున్నాడు. కానీ జక్కన్న మాత్రం సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇందుకు అల్లు అరవింద్ తో ఉన్న విబేధాలే కారణం.

Allu Arvind And SS Rajamouli Has Some Differences
మగధీర సినిమాకు అరవింద్ ప్రొడ్యూసర్ గా చేశాడు. అప్పుడు రాజమౌళి కొన్ని కండీషన్లు పెట్టాడు. ఈ సినిమా వసూళ్ల లెక్కలు బయటకు చెప్పొద్దు అని, అంతే కాకుండా మగధీరను తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని కోరాడు. కానీ అరవింద్ అలా రిలీజ్ చేయలేదు. అంతే కాకుండా లెక్కలు మొత్తం బయటకు చెప్పేశాడు. దాంతో అప్పట్లో వీరిద్దరి నడుమ పెద్ద ఎత్తున గొడవలు వచ్చాయని టాక్ వినిపించింది. అప్పటి నుంచే రాజమౌళి అల్లు ఫ్యామిలీతో దూరంగా ఉంటున్నాడు. మరి భవిష్యత్ లో సినిమా చేస్తాడో లేదో చూడాలి.