Allu Arjun : బన్నీ కెరీర్ ను నాశనం చేస్తున్న అల్లు అరవింద్.. ఆ తప్పుడు పని అవసరమా..?
NQ Staff - March 17, 2023 / 04:00 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ క్రేజ్ మొన్నటి వరకు సౌత్ వరకు మాత్రమే ఉండేది. కానీ పుష్ప సినిమాతో ఆయన స్థాయి బాలీవుడ్ ను దాటిపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి ఊపు మీద ఉన్నాడు బన్నీ. దాంతో ఆయన మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి బన్నీ క్రేజ్ పెరిగింది.
ఇక ఈ స్థాయిని పదిలం చేసుకోవడానికి సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప-2 సినిమాను కూడా చేయబోతున్నాడు. పుష్ప-2 సినిమాను దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో తీస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా తర్వాత బన్నీ రేంజ్ పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా బన్నీకి పెద్ద ఆఫర్లు వస్తున్నాయి.
రీసెంట్ గా పోస్టు..

Allu Arjun Will Host Talk Show On Aha OTT
ఇలాంటి సమయంలో బన్నీతో ఓ తప్పుడు పని చేయిస్తున్నాడు అల్లు అరవింద్. ప్రస్తుతం ఆహా ఓటీటీలో ఇప్పటికే బాలయ్య హోస్ట్ గా ఓ టాక్ షో నడుస్తోంది. దాంతో పాటు ఇప్పుడు బన్నీతో కూడా టాక్ షో చేయించాలని చూస్తున్నాడు అరవింద్. రీసెంట్ గానే ఇందుకు సంబంధించిన పోస్టు కూడా ఆహా పెట్టింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఎందుకంటే హోస్ట్ గా బన్నీ ఫెయిల్ అయితే ఆయన క్రేజ్ పూర్తిగా పడిపోతుందని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ ఇలాగే ఓ టాక్ షో చేసి ఎంతగా ఇమేజ్ పోగొట్టుకున్నాడో అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి పనితో బన్నీ ఇమేజ్ పోగొట్టొద్దు అంటూ చెబుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.