Most Eligible Bachelor: హైదరాబాద్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
Tech Sai Chandu - October 18, 2021 / 04:11 PM IST

Most Eligible Bachelor అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మూడు ఫ్లాపుల తర్వాత అఖిల్‌కి ఈ సినిమా రూపంలో మంచి విజయం దక్కింది. చిత్రం మంచి విజయం సాధించిడంతో సినిమాకు సంబంధించిన థాంక్యూ మీట్ వైజాగ్‌లో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. సినిమా యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు.
ఈ ఈవెంట్లో మాట్లాడిన అఖిల్.. 100% ఆక్యుపెన్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ సినిమా నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను.. అదే టీం వర్క్. కథను నమ్మి చేశాము అని అన్నారు.
ఇప్పుడు హైదరాబాద్‌లోను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నారు. రేపు సక్సెస్ మీట్ జరగనుండగా, ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నట్టు సమాచారం.ఈ వార్త బయటకు రావడంతో బన్నీ ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి నాగా చైతన్య చీఫ్ గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. అఖిల్, పూజాల కెమిస్ట్రీ కి తెలుగు ప్రేక్షకులు పట్టంగట్టారు. మొత్తానికి ఈ దసరా బరిలో దిగి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా విజేతగా నిలిచింది. ఈ సినిమాతో అఖిల్ అక్కినేని మొదటి కమర్షియల్ హిట్ అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.