Allu Arjun: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్.!

NQ Staff - June 16, 2022 / 09:01 PM IST

Allu Arjun: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్.!

Allu Arjun: లోకేష్ కనగరాజ్.. ఈ పేరిప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కారణం ‘విక్రమ్’ సినిమా మాత్రమే కాదు, అంతకు ముందు ఆయన తెరకెక్కించిన ‘ఖైదీ’ సినిమా కూడా. విషయం వున్న దర్శకుడు.. కాదు కాదు, బోల్డంత టాలెంట్ వున్న దర్శకుడంటూ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది ఈ యంగ్ డైరెక్టర్ గురించి.

Allu Arjun to team up with Director Lokesh Kanagaraj

Allu Arjun to team up with Director Lokesh Kanagaraj

జక్కన్న రాజమౌళి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ కోవలోకి అతి తక్కువ కాలంలోనే చేరిపోయాడేమో లోకేష్ కనగరాజ్.. అనేంతలా, ఇప్పుడీ యువ దర్శకుడి గురించిన చర్చ జరుగుతోంది.
లోకేష్ దర్శకత్వంలో ఫలానా హీరో.. అంటూ కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వచ్చి పడుతున్నాయంటే, అదీ ఈ యంగ్ డైరెక్టర్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల తీరు.

స్టైలిష్ స్టార్ తదుపరి సినిమా లోకేష్ దర్శకత్వంలోనేనా.?

స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్.
కాగా, ‘పుష్ప ది రూల్’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనేనని అంటున్నారు. సమర్థత కలిగిన దర్శకుడు.. సమర్థత గలిగిన హీరో.. అంటూ ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us