ALLU ARJUN: అల్లు అర్జున్‌కు క‌రోనా పాజిటివ్…ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన బ‌న్నీ

ALLU ARJUN: మెగా ఫ్యామిలీ హీరోలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. గ‌త ఏడాది నాగ‌బాబు , రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌లు క‌రోనా బారిన ప‌డ‌గా, సెకండ్ వేవ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సోకింది. ఆయ‌న త‌న ఫాం హౌజ్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య‌ప‌రిస్థితి అంత‌గా మెరుగు ప‌డ‌లేదు. ఈ లోపే మెగా ఫ్యామిలీకి చెందిన మ‌రో హీరో అల్లు అర్జున్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

హ‌లో ఎవ్రీ వ‌న్, నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వెంట‌నే క్వారంటైన్‌కు వెళ్లాను. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాను.ఇటీవ‌లి కాలంలో న‌న్ను క‌లిసిన వాళ్లు ప‌రీక్ష‌లు చేయించుకోండి.ఇంట్లోనే జాగ్ర‌త్త‌గా ఉండండి. త‌గిన స‌మ‌యంలో వ్యాక్సిన్ చేయించుకోండి. నా శ్రేయోభిలాషులు, స‌న్నిహితులు, అభిమానులు ఎవ‌రు ఆందోళ‌న చెందొద్దు. నేను క్షేమంగా ఉన్నాను అని బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉండ‌గా,ఈ సినిమాను సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నాడు.

Advertisement