Allu arjun: పుష్పరాజ్ డబ్బింగ్ మొదలు పెట్టిన అల్లు అర్జున్..

Allu arjun: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు. రెండు పార్టులుగా రిలీజ్ అవుతున్నాయి.

allu arjun started dabbing
allu arjun started dabbing

డిసెంబర్ 17 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మాస్ యాక్షన్ ఒరియెంటెడ్ గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, వీడియోలు, లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి.

ఈ క్రమంలో దాక్కో దాక్కో మేక, శ్రీవల్లీ సాంగ్స్ కి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీ స్థాయిలోనే ప్లాన్ చేశారు సుకుమార్. ఇక పుష్ప సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి.

ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్లొన్నారు. ఈ సినిమా డబ్బింగ్ వీడియోని ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ డబ్బింగ్ థియేటర్ కు రావడం, లోపలకు వెళ్ళి డబ్బింగ్ చెప్పడం లాంటి షాట్స్ ఉన్నాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కంప్లీట్ విలక్షణమైన పాత్రలో కనిపించి, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. మలయాళం నటుడు ఫాహద్ మెయిన్ విలన్ గా నటించడం మరో హైలెట్ గా నిలవను