Allu Arjun: అల్లు అర్జున్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. గాల్లో తేలిపోయిన రోల్ రైడా

Allu Arjun special gift to Roll Rida
Allu Arjun special gift to Roll Rida

Allu Arjun అల్లు అర్జున్ ఈ మధ్య తన సన్నిహితులు, తన అభిమానులకు స్పెషల్‌గా సర్ ప్రైజ్‌లు ఇస్తున్నాడు. అయితే తనను చూడటానికి వచ్చినా.. అభినందించేందుకు వెళ్లినా కూడా బన్నీ ఈ మధ్య అందరికీ ఒక్కో మొక్కను ఇస్తున్నాడు. దాన్ని జాగ్రత్తగా పెంచమని సూచిస్తున్నాడు. అలా అల్లు అర్జున్ తనకు వీలైనంతలో అంతా పచ్చదనం వచ్చేలా చేస్తున్నాడు. అయితే తాజాగా ఇలానే రోల్ రైడాకు బన్నీ సర్ ప్రైజింగ్‌గా ఓ మొక్కను పంపాడు. దాంతో పాటు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ లెటర్ కూడా రాసేశాడు బన్నీ.

బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడాకు బన్నీకి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా? అల వైకుంఠపురములో సినిమాలో ఓమైగాడ్ డాడీ అనే పాటలో ర్యాప్ రాసింది.. పాడింది కూడా రోల్ రైడానే. అలా తెలుగులో ర్యాప్ పాడే వారన్నా.. అలా ర్యాప్‌ను తెలుగులో ప్రమోట్ చేసే వారన్నా కూడా బన్నీకి ఎంతో ఇష్టమట. అలా రోల్ ర్యాప్ బన్నీకి తెగ నచ్చేసిందట. ఈ విషయాన్ని గత ఏడాది ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అయితే మళ్లీ ఈ మధ్య బన్నీ కోసం రోల్ స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేశాడు.

అల్లు అర్జున్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. Allu Arjun
బన్నీ పదిహేనేళ్ల కెరీర్‌ పై రోల్ ఓ ర్యాప్ సాంగ్ రాసి కంపోజ్ చేసి రిలీజ్ చేశాడు. దాన్ని విన్న బన్నీ ఎమోషనల్ అయ్యాడు. థ్యాంక్స్ చెబుతూ ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ షేర్ చేశాడు. అలా బన్నీ, రోల్ మధ్య మంచి బంధం ఏర్పడింది. అందుకే రోల్ రైడా బర్త్ డేను గుర్తు పెట్టుకుని మరీ బన్నీ స్పెషల్‌గా సర్ ప్రైజ్ చేశాడు. ఓ మొక్కను బహుమతిగా పంపాడు.

గాల్లో తేలిపోయిన రోల్ రైడా
అలా బన్నీ నుంచి వచ్చిన బహుమతిని, విషెస్‌ను చూసిన రోల్.. తెగ సంబరపడిపోయాడు. చిన్న తనం నుంచి ఆదర్శంగా తీసుకున్న హీరో నుంచి ఇలా గిఫ్ట్ రావడంతో నా బర్త్ డే స్పెషల్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లుగా ఎన్ని బర్త్ డేలు సెలెబ్రేట్ చేసుకున్నా కూడా దీనంత స్పెషల్‌గా ఏది కాలేదని, అది మీ వల్లే జరిగిందంటూ బన్నీపై రోల్ రైడా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Advertisement