ALLU ARJUN : అల్లు అర్జున్ 21వ సినిమాపై సాలిడ్ అప్ డేట్.. ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న నెటిజ‌న్స్

ALLU ARJUN : క‌రోనా వ‌ల‌న దాదాపు ఎనిమిది నెల‌ల పాటు ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు ఈ ఖాళీ సమ‌యంలో అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై పూర్తి దృష్టి పెట్టారు. దీంతో ఒక్కో హీరో వరుస సినిమాల‌ను ప్ర‌క‌టిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ స‌లార్, ఆదిపురుష్ చిత్రంతో పాటు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక‌ల్ మూవీ చేస్తున్నారు. చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చేస్తుండ‌గా, దీని త‌ర్వాత లూసిఫ‌ర్, వేదాళం రీమేక్ చిత్రాలు చేయ‌నున్నాడు. వాటి త‌ర్వాత బాబీ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇక ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన వ‌కీల్ సాబ్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్, క్రిష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. వీటి త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, నాని, శ‌ర్వానంద్ వంటి హీరోలు కూడా ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండ‌గా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వ‌రుస సినిమాల‌తో వినోదాన్ని అందించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే చిత్రాన్ని చేస్తుండ‌గా, ఈ మూవీని ఆగ‌స్ట్ 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీ బృందం కేర‌ళ‌కు వెళ్ళనుంది.

పుష్ప త‌ర్వాత అల్లు అర్జున్ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌నున్నాడు అనే ప్ర‌శ్న అంద‌రి మ‌దిలో మెద‌లుతూ వ‌స్తుంది. గ‌తంలో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్.. కొరటాల శివతో ఓ సినిమాను చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు బ‌న్నీ. ఇందులో ఏది ముందు సెట్స్ పైకి వెళుతుంది అనే అనుమానంపై తాజాగా స‌మాధానం దొరికింది. మేక‌ర్స్ ఓ అఫీషియ‌ల్ ప్ర‌క‌టన విడుద‌ల చేస్తూ అల్లు అర్జున్ 21 చిత్రంగా కొర‌టాల శివ మూవీ తెర‌కెక్క‌నుంద‌ని, పుష్ప సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత మూవీ షూటింగ్‌ను మొద‌లు పెట్టి 2022 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తాం అని అన‌నారు. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement